తల్లిదండ్రులు తమ పిల్లలు సక్సెస్ అందుకోవాలని ఆశించడం తప్పుకాదు. అయితే పిల్లలలో సంస్కృతి బీజాలను నాటడం మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం నేర్పించినప్పుడే తల్లిదండ్రుల కల నెరవేరుతుంది. తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు పిల్లలను మరింత వృద్ధిలోకి తీసుకొస్తాయి.
Advertisement
చాణక్య నీతి ప్రకారం.. పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రులకు అబద్ధం చెబుతారు. అలాంటి అబద్ధాలను తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటే అలా అబద్ధాలు చెప్పడం వారి అలవాటులో భాగమైపోతుంది. ఇది వారి భవిష్యత్‌ను పాడుచేయడమే కాకుండా.. అవసరమైతే తమ తల్లిదండ్రుల విషయంలో కూడా అబద్ధం చెప్పడానికి వెనుకాడరు. మొదటిసారి పిల్లలు అబద్ధం చెప్పినప్పుడే తప్పులను నిర్లక్ష్యం చేయడం తల్లిదండ్రుల సరైన దారిలో పెట్టాలి.
కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు. తల్లిదండ్రుల మాట వినరు. ఇలాంటి అలవాట్లను చిన్నతనంలోనే సరిదిద్దుకోవాలి. తల్లిదండ్రులు ప్రేమతో మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం నేర్పాలి. లేకపోతే ఈ అలవాటు పిల్లలకు చాలా హానికరం.
Advertisement
చాణక్యుడి ప్రకారం.. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ పెట్టాలి. చదువుతో పాటు మహానుభావులు కథలు చెబుతూ మంచి పని చేసేవిధంగా వారిని ప్రేరేపించండి. దీంతో పిల్లల మనసులో మంచి ఆలోచనలు పెరిగి సమాజంలో గౌరవం సంపాదించుకునేలా ఎదగాలి అనే తపన పెరుగుతుంది. పిల్లలు స్వయంగా మంచి పనులు చేయడానికి ముందడుగు చేస్తారు.
ఆచార్య చాణక్యుడు ఐదేళ్ల పాటు పిల్లలను చాలా ప్రేమగా చూడాలని చెప్పాడు. ఎందుకంటే ఈ వయస్సు పిల్లలకు మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించే అవగాహన ఉండదు. ఐదేళ్ల తరువాత పిల్లలతో కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండాలి. 16 సంవత్సరాల వయస్సులో మీరు పిల్లలతో స్నేహంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి :
- ప్రశాంత్ కిషోర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరిన అధినాయకత్వం..!
- జయమ్మ పంచాయతీ ట్రైలర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
- ఆచార్య నుంచి అప్‌డేట్.. భలే భలే బంజారా సాంగ్ విడుదల ఎప్పుడంటే..?