Home » ఆచార్య నుంచి అప్‌డేట్‌.. భ‌లే భ‌లే బంజారా సాంగ్ విడుద‌ల ఎప్పుడంటే..?

ఆచార్య నుంచి అప్‌డేట్‌.. భ‌లే భ‌లే బంజారా సాంగ్ విడుద‌ల ఎప్పుడంటే..?

by Anji
Ad

ఓవైపు ఆర్ఆర్ఆర్, మ‌రొక వైపు కేజీఎఫ్ సినిమాల‌ను చూడ‌డంలో బిజీగా ఉన్న ఫిల్మీ ల‌వ‌ర్స్‌ను ఒక్కసారిగా విడుద‌లైన ప‌వ‌ర్ పుల్ ట్రైల‌ర్‌తో త‌న‌వైపు తిప్పుకున్నాడు ఆచార్య‌. ట్రైల‌ర్ విడుద‌లైన కొద్ది క్ష‌ణాల్లోనే రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌ను షేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది ఆచార్య సినిమా. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.


టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్న విష‌యం విధిత‌మే. ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతో కాలంగా చ‌ర‌ణ్‌, చిరు క‌లిసి న‌టిస్తే చూడాల‌నుకున్న అభిమానుల‌కు కొర‌టాల శివ అదిరిపోయే ట్రీట్ ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆచార్య‌పై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసాయి. విడుద‌ల తేదీ రోజు రోజుకు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో తాజాగా ఆచార్య టీమ్ మ‌రొక సాంగ్ కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది.

Advertisement

తాజాగా ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ కొర‌టాల శివ క‌నిపించారు. తొలుత కొరటాల శివ మాట్లాడుతూ భ‌లే భ‌లే బంజారా సాంగ్ చిత్రీక‌రించేట‌ప్పుడు ఎంతో మంది నాకు సినిమా టికెట్ల కోసం ఫోన్ చేశారు. చిరంజీవి, చ‌ర‌ణ్ డ్యాన్స్ చేస్తుంటే చూడాల‌ని చాలా మంది ఫోన్ చేశారు. పాట సూప‌ర్‌గా వ‌చ్చింది. మీ ఇద్ద‌రి డ్యాన్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరంజీవి చ‌ర‌ణ్‌తో డ్యాన్స్ చేయాల‌నే కాస్త టెన్ష‌న్‌గా ఉంది. కాన గ‌ట్టి పోటీ ఇస్తా అన్నారు.

Advertisement


ఈ మ‌ధ్య‌నే చ‌ర‌ణ్‌, తార‌క్ నాటు నాటు సాంగ్‌లో ఇద్ద‌రూ క‌లిసి వేసిన‌ స్టెప్పులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చ‌ర‌ణ్‌తో డ్యాన్స్ లో రాణించాల‌నేది ఒక టెన్ష‌న్ అయితే ఎదురుగా అంద‌రి ముందూ డ్యాన్స్ చేయ‌డం మ‌రొక టెన్ష‌న్ అని.. అయినా కానీ గ‌ట్టిగా పోటీ ఇస్తాన‌ని చెప్పారు చిరంజీవి. డామినేట్ చేస్తావా అని చిరంజీవి చ‌ర‌ణ్‌ను అడ‌గ‌గా.. లేదు అప్ప అని చ‌ర‌ణ్ స‌మాధానం చెప్పాడు. నేను నీ బాబును రా అని చిరంజీవి అంటే.. నేను కూడా త‌గ్గ‌ను అని పేర్కొన్నాడు. స‌రే మాట‌ల‌తో ఎందుకు కెమెరా ముందు చూసుకుందామ‌ని చిరంజీవి చ‌ర‌ణ్‌కు ఛాలెంజ్ విసిరాడు. స‌ర‌దాగా కొన‌సాగిన ఈ వీడియోలో చివ‌ర‌కు ఏప్రిల్ 18న భ‌లే భ‌లే బంజారా సాంగ్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక మెగా అభిమానులు ఈ వీడియో చూసి పండుగ చేసుకుంటారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

  1. రాముడు దేవుడే కాదు.. బీహార్ మాజీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
  2. ఆ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని కొట్టిన రాధిక…అసలు ఏం జరిగిందంటే….!
  3. 23న విజ‌యవాడలో ఆచార్య ప్రీ రిలీజ్‌.. చీఫ్ గెస్ట్ ఎవ‌రంటే..?
Visitors Are Also Reading