Telugu News » Blog » ప్ర‌శాంత్ కిషోర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని కోరిన అధినాయ‌క‌త్వం..!

ప్ర‌శాంత్ కిషోర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని కోరిన అధినాయ‌క‌త్వం..!

by Anji
Ads

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ను పార్టీలో చేరాల‌ని కాంగ్రెస్ పార్టీ అధినాయ‌క‌త్వం కోరిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. శ‌నివారం సోనియాగాంధీ నివాసంలో నిర్వ‌హించిన కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల స‌మావేశంలో 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై ప్ర‌శాంత్ వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన త‌రువాత ప్ర‌శాంత్ కిషోర్‌ను పార్టీలో చేరాల్సిందిగా కోరిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

పార్టీలో చేరి ఓ కీల‌క నాయ‌కుడిగా ప‌ని చేయాల‌ని అడిగార‌ట‌. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల నాటికి అవ‌స‌ర‌మైన రోడ్డుమ్యాప్, సంస్థాగ‌త మార్పుల గురించి ఓ వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌జెంటేష‌న్ ఇచ్చాడు. కాంగ్రెస్ బ‌లంగా ఉన్న రాష్ట్రాల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టాల‌ని ప్ర‌శాంత్ పేర్కొన్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా 370 లోక్‌స‌భ స్థానాల‌పై కాంగ్రెస్ దృష్టి సారించాల‌ని.. మిగిలిన స్థానాల్లో పొత్తులు పెట్టుకోవాల‌ని ప్ర‌శాంత్ చెప్పిన‌ట్టు పార్టీ వ‌ర్గాల స‌మాచారం.

Advertisement


ప్ర‌జెంటేష‌న్‌పై నేత బృందం చ‌ర్చిస్తోంద‌ని రాహుల్ గాంధీ కూడా స‌మావేశంలో చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల వ్యూహాల‌పై కూడా ప్ర‌శాంత్ కిషోర్ చ‌ర్చించారు.

ఇవి కూడా చదవండి :  

  1. హనుమాన్ జ‌యంతి రోజు బ‌జ‌రంగ్ బ‌లికి ఈ 8 ప్ర‌సాదాల‌ను అందిస్తే.. అదృష్టం మిమ్మ‌ల్ని వ‌రుస్తుంది
  2. జయమ్మ పంచాయతీ ట్రైలర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
  3. ఆచార్య నుంచి అప్‌డేట్‌.. భ‌లే భ‌లే బంజారా సాంగ్ విడుద‌ల ఎప్పుడంటే..?