Home » జయమ్మ పంచాయతీ ట్రైలర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

జయమ్మ పంచాయతీ ట్రైలర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Sravanthi
Ad

గత కొన్నేళ్లుగా బుల్లితెరపై విశేషంగా రాణిస్తున్న సుమ ఇప్పుడు వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. తన మాటల తూటాలతో సినిమా ఫంక్షన్స్ లో హోస్ట్ చేయడమే కాదు నేరుగా సినిమాల్లో కూడా నటించి తన సత్తా చాటాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఓ బలమైన క్యారెక్టర్ తో కెమెరా ముందుకు వచ్చింది. జయమ్మ పంచాయతీ మూవీ తో త్వరలోనే సుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా టైటిల్,ఫస్ట్ లుక్ పోస్టర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసి ఆ సినిమాపై ఆసక్తి పెంచేశారు. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సుమ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండనుందని క్లియర్ హింట్ ఇచ్చారు. తాజాగా పవర్ స్టార్ చేతులమీదుగా ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

Advertisement

Advertisement

రా బావ మా ఊరి పంచాయతీ చూద్దువు గాని ఏ ఊర్లో లేని వెరైటీ గొడవ జరుగుతుంది అనే డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. ఈ ట్రైలర్ అంతా పంచాయతీ దాని గొడవ చుట్టూ తిరిగినా,సమస్య ఏమిటన్నది మాత్రం దాటేశారు. పల్లెటూరు అక్కడ విచిత్రమైన మనుషులు, వాళ్ల సమస్యలు ముఖ్యంగా పంచాయతీ. వీటి మధ్యనే ఈ సినిమా తిరగబోతోందన్న విషయం మాత్రం ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. సుమ డైలాగ్ తన యాస తో ఆకట్టుకున్నారు. ఈ కథకి మెయిన్ పిల్లర్ తనే అనేది ట్రైలర్ తో మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. కీరవాణి లాంటి దిగ్గజం ఈ సినిమాకు సంగీతం సమకూర్చడం సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

ఆ సినిమాలో సుమా తప్ప పెద్దగా తెలిసిన మొహాలేవి లేవు. అంటే సుమా క్యారెక్టర్ మీదనే సినిమా ఫలితం ఆధారపడి ఉంది. ఇక ట్రైలర్ ని బట్టి జయమ్మ భర్త అనారోగ్యంతో బాధ పడుతుండగా ఆమె తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.తన నిర్ణయానికి కట్టుబడి ఆ గ్రామంపై కూడా పోరాడేందుకు ఆమె సిద్ధమైందని స్పష్టమవుతోంది. జయమ్మ గా సుమ తన అభినయంతో ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని మే 6న థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు.బుల్లి తెరపై తిరుగులేని సామ్రాజ్యం స్థాపించుకున్న సుమ వెండితెరపై ఏ మాత్రం అలరిస్తుందో చూడాలి.

 

 

Visitors Are Also Reading