Telugu News » Blog » భారత ఆటగాళ్లు లేకుండానే టెస్ట్ టాప్ 5..!

భారత ఆటగాళ్లు లేకుండానే టెస్ట్ టాప్ 5..!

by Manohar Reddy Mano
Ads
భారత బ్యాటర్లు ఈ మధ్య టెస్టులో పెద్దగా రాణించడంఓ లేదు. టాప్ టెస్ట్ ప్లేయర్లుగా పేరు సంపాదించుకున్న కోహ్లీ, పుజారా, రహానే ఎవరు పెద్దగా పరుగులు చేయడం లేదు. దాంతో చాలా కాలం తర్వాత ఒక్క భారత ఆటగాడు లేకుండానే టెస్ట్ టాప్ 5 ఉంది. తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకులు విడుదల అయ్యాయి. అందులో మొదటి 5 స్థానాల్లో ఒక్క భారత ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హం.
అయితే తాజా వచ్చిన ఈ టెస్ట్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్ 902 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే తాజాగా టెస్టులో 10 వేల పరుగులు పూర్తి చేసిన జో రూట్ 892 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక స్టీవ్ స్మిత్ 845 పాయింట్లు, పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ 815 పాయింట్లు, కేన్ విలియమ్సన్ 806 పాయింట్లతో వరుసగా మూడు నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక టాప్ 5 లో ఒక్క భారత ఆటగాడు లేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ 754  పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుండగా.. 742  పాయింట్లతో విరాట్ కోహ్లీ 10వ స్థానంలో ఉండి టాప్ 10లిస్టులో ఉన్నారు.
ఇక బౌలర్లలో టాప్ 5 లో ఇద్దరు భారత బౌలర్లు చోటు సంపాదించుకున్నారు. 2వ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ 850 పాయింట్లతో ఉంటె… 4వ స్థానంలో 830 పాయింట్లతో జస్ప్రీత బుమ్రా ఉన్నాడు. ఇక అందే విధంగా ఆల్ రౌండర్లలో మొదటి రెండు స్థానాల్లో మన ఆటగాళ్లే ఉన్నారు. మోశాటి స్థానంలో ఇండియన్ స్టార్ రవీంద్రా జడేజా  385 పాయింట్లతో ఉండగా… రెండో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ 341 పాయింట్లతో నిలిచాడు.