పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు రాజకీయాలను మరోవైపు సినిమాలను పవన్ మ్యానేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
Advertisement
ALSO READ :ఉదయం నిద్ర లేవగానే మీకు నీరు తాగే అలవాటు ఉందా ? దీంతో అద్భుతమైన ప్రయోజనాలు..!
ఇదిలా ఉంటే ఈ సినిమా తరవాత పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్….ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్ కల్యాణ్ పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక హరీష్ శంకర్ క్రేజీ డైరెక్టర్ కావడం….వీరిద్దరి కాంబిషన్ లో గబ్బర్ సింగ్ లాంటి సినిమా రావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.
Advertisement
Harish Shanker
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఓ ట్వీట్ చేశాడు…మూడేళ్ల సమయం తీసుకుని తేరీ సినిమాను రీమేక్ గా ఉస్తాద్ భగత సింగ్ చేయడం ఏంటని ప్రశ్నించాడు. షాక్ ఫ్లాప్, మిరపకాయ్ హిట్, గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్, రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్, సుబ్రమణ్యం ఫర్ సేల్ సూపర్ హిట్, దువ్వాడ జగన్నాథమ్ హిట్,
గద్దల కొండ గణేష్ సూపర్ హిట్ కథలను రచించడంలో అద్భుతమైన టాలెంట్ ఉన్న హరీశ్ శంకర్ మూడేళ్ల సమయం తీసుకుని తెరకెక్కించడమేంటి..? అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా ఈ ట్వీట్ కు హరీశ్ శంకర్ రిప్లై ఇస్తూ…కేవలం భావాలను వ్యక్త పరచడానికే ట్విట్టర్ ఉంది. వివరణ ఇవ్వడానికి కాదు అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Advertisement
ALSO READ :పవన్ కల్యాణ్ సినిమాలో మల్లారెడ్డికి బంపరాఫర్..కానీ ఎందుకు రిజెక్ట్ చే శారంటే..?