Home » 13 ఏళ్లకే అలాంటి పని చేశాను.. విశ్వక్ సేన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

13 ఏళ్లకే అలాంటి పని చేశాను.. విశ్వక్ సేన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరోలలో విశ్వక్ సేన్ ముందు వరుసలో ఉన్నారు. చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీతో త్వరలో థియేటర్లోకి రాబోతున్నాడు. ఈ సినిమా కంటే ముందు అశోకవనంలో అర్జున కళ్యాణం అనే చిత్రంతో సూపర్ హిట్ కొట్టి మంచి నటుడిగా మార్కులు కొట్టేశాడు. ఈయన సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు. అలాంటి విశ్వక్ సేన్ బిహేవియర్ మీద ఈ మధ్యకాలంలో అనేక వార్తలు వచ్చాయి..

also read;సూపర్ స్టార్ కృష్ణ సినిమా టైటిల్ విషయంలో అంత జరిగిందా..?

Advertisement

అయితే ఆయన అర్జున్ సార్జా తన కూతురుని హీరోయిన్ గా విశ్వక్ సేన్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో పరిచయం చేయాలనుకున్నాడట. దీనికి విశ్వక్ సేన్ కూడా ముందుగా ఒప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్ రెడీ అయ్యి మొదటి రోజే హ్యాండ్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ తరుణంలో సినిమా మొదటి రోజు విశ్వక్ సేన్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు కాబట్టి ఆ సినిమాపై బజ్ పెరిగిపోయింది. అయితే విశ్వక్ సేన్ హ్యాండ్ ఇవ్వడంతో అర్జున్ కు చాలా కోపం వచ్చిందట.

Advertisement

also read:నాగార్జున “సూప‌ర్” సినిమా హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా.?

దీంతో వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. వీరు చేద్దామనుకున్న సినిమా కూడా ఆగిపోయింది. దీంతో అర్జున్ మరో హీరోని వెతుక్కునే పనిలో పడ్డారు . అలాంటి విశ్వక్సేన్ తాజాగా ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తాను 13 ఏళ్ల వయసులోనే యానిమేషన్ కోర్స్ నేర్చుకున్నానని ,అప్పటి ఐడీ ని చూపించాడు. ఇందులో విశ్వక్ సేన్ పేరు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఈ హీరో అసలు పేరు దినేష్ నాయుడు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ పేరు కలిసి రావడం లేదని విశ్వక్ సేన్ గా మార్చుకున్నారట .

also read:

Visitors Are Also Reading