Home » Hunt Telugu Movie Review : సరికొత్త యాంగిల్ లో సుధీర్ బాబు..!

Hunt Telugu Movie Review : సరికొత్త యాంగిల్ లో సుధీర్ బాబు..!

by Anji
Ad

సాధారణంగా తరచూ మనం మలయాళంకి సంబంధించినటువంటి సినిమాలను చూస్తుంటాం. ఇలా సినిమాలను మన దగ్గర ఎందుకు తీయరు అని అనుకుంటుంటాం. అక్కడి కథ, కథనాలు చాలా నేచురల్ గా కనిపిస్తుంటాయి. తెలుగువారు ఎక్కువగా అక్కడి సినిమాలను రీమేక్ చేస్తుంటారు. ఇలాంటి తరుణంలోనే సుధీర్ బాబు హంట్ కూడా రీమేక్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించినటువంటి ముంబై పోలీస్ సినిమాను తెలుగులో హంట్ చిత్రంగా తీశారు. 

Advertisement

నటినటులు 

భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద ప్రసాద్ నిర్మించిన హంట్ సినిమాలో సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్, మైమ్ గోపి, కబీర్ సింగ్, దుల్హన్, మంజుల, సంజయ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. 

కథ :

ముగ్గురు పోలీస్ ఆఫీసర్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఐపీఎస్ అధికారులు అయినటువంటి అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు ),  మోహన్ (శ్రీకాంత్), దేవ్ (భరత్)ల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఆర్యన్ దేవ్ ని ఎవరో చంపుతారు. ఆ కేసును సుధీర్ బాబు చేదిస్తాడు. చివరి నిమిషంలో సుధీర్ బాబు( అర్జున్ ప్రసాద్)కి యాక్సిడెంట్ కావడంతో గతాన్ని మరిచిపోతాడు. ఈ కేసు తేలకుండానే అలానే మిగిలిపోతుంది. మళ్లీ అర్జున్ కి గతం గుర్తుకొస్తుందా..? ఆ కేసును పరిష్కరిస్తాడా..? అసలు ఆర్యన్ ని చంపింది ఎవరు ? చివరికీ అర్జున్ ఏం చేశాడనేది ఈ చిత్రం యొక్క కథ. 

Also Read :   Chiranjeevi : ఫ్లాప్ టాక్ తో మొదలై బాలీవుడ్ ను షేక్ చేసిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా!

విశ్లేషణ  :

Advertisement

Manam News

ముఖ్యంగా మలయాళంలో ముంబై పోలీస్ చిత్రాన్ని చూసినటువంటి వారికి హంట్ మూవీ గొప్పగా అనిపించకపోవచ్చు. ఈ ఒక్క పాయింట్ తోనే ఈ సినిమా తీసేందుకు ముందుకొచ్చిన సుధీర్ బాబు ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఇలాంటి కథను మన వాళ్లు ఓకే చేయడం అంత ఈజీ కాదు. సుధీర్ బాబు మాత్రం తన ఇమేజ్ కి పూర్తిగా భిన్నమైన పాత్ర ఎంచుకున్నాడు. ఇక సినిమా మెయిన్ పాయింట్ లో మాత్రం ఎలాంటి మార్పులను చేయలేదు. కథనం విషయంలో మాత్రం కొంచెం మార్పులు, చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ముందే తెలిసిన వారికి ఈ చిత్రం కాస్త సహన పరీక్ష మాదిరిగా ఉంటుంది. సినిమా చాలా స్లోగా సాగుతుంది. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఒరిజినల్ ఉండగా.. తెలుగులో దానిని తమకు అనుగుణంగా ఎడిట్ చేశారు. ప్రథమార్థం కాస్త స్లోగా అనిపిస్తే.. ద్వితీయార్థంలోనే అసలు కథ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సుధీర్ బాబు మెప్పిస్తాడు. ఈ చిత్రంలో విజువల్స్, ఎడిటింగ్, మాటలు అన్ని అద్భుతంటా ఉన్నాయి. భవ్య క్రియేషన్ కి తగినట్టుగా నిర్మాణ విలువలున్నాయి. ఓవరాల్ గా సుధీర్ బాబులో ఓ కొత్త యాంగిల్ ని హంట్ సినిమాలో చూడవచ్చు. 

Also Read :  కీరవాణికి పద్మ శ్రీ రావడంపై రాజమౌళి ఎమోషనల్ పోస్ట్..!

ప్లస్ పాయింట్స్ :

  • సుధీర్ బాబు నటన 
  • క్లైమాక్స్ 

మైనస్ పాయింట్స్ 

  • ప్రథమార్థం స్లోగా సాగడం 
  • మధ్య మధ్యలో బోరు అనిపించడం

రేటింగ్ 

2.75/ 5

Also Read :   Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్.. హాజరైన చరణ్, ఉపాసన

Visitors Are Also Reading