Telugu News » Blog » Chiranjeevi : ఫ్లాప్ టాక్ తో మొదలై బాలీవుడ్ ను షేక్ చేసిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా!

Chiranjeevi : ఫ్లాప్ టాక్ తో మొదలై బాలీవుడ్ ను షేక్ చేసిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా!

by Bunty
Ads

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం చిరంజీవితో పాటు ఆయన వారసులు కూడా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక మెగాస్టార్ హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్టేట్ రౌడీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు మొదట ఫ్లాప్ టాక్ రాగా, మెల్లిమెల్లిగా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించగా, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. 1989 సంవత్సరంలో మార్చి 23న ఈ చిత్రం విడుదల అయింది. ఇక సినిమాలో మెగాస్టార్ కు జోడిగా రాధా, భానుప్రియ హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది.ఈ సినిమా విడుదలైన సమయంలోనే బాలీవుడ్ లో అమితాబచ్చన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి స్టేట్ రౌడీ సినిమాకు అత్యధిక కలెక్షన్లు వచ్చాయి.

Advertisement

దాంతో ఓ ప్రముఖ మ్యాగజైన్ వేర్ ఇస్ అమితాబచ్చన్ అంటూ చిరంజీవి పై ఆర్టికల్ ను ప్రచురించింది. బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఆర్టికల్ చూసి ఆశ్చర్యపోయారు. స్టేట్ రౌడీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమా 100 రోజులు వేడుకను ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ కు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు హాజరయ్యారు.

Advertisement

READ ALSO : Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్.. హాజరైన చరణ్, ఉపాసన