Home » హైదరాబాద్ లో వుండే.. ఈ ఏరియాలకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా..?

హైదరాబాద్ లో వుండే.. ఈ ఏరియాలకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా..?

by Sravya
Ad

హైదరాబాదులో చాలా ప్రాంతాలు ఉన్నాయి. మసాబ్ ట్యాంక్, మలక్పేట్, సికింద్రాబాద్, నాంపల్లి ఇలా… అయితే కొన్ని పేర్లు వింటే ఏంటి ఈ పేర్లు పెట్టారా అని తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందికి ఉంటుంది. కొన్ని పేర్లు వెనక దాగి ఉన్న అర్థాలని ఈరోజు మేము వివరించాము. ముందు శంషాబాద్ గురించి చూస్తే… షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు కాస్త శంషాబాద్ కింద మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబడడంతో ఈ పేరు చాలా పాపులర్ గా మారింది. షమ్స్ అంటే సూర్యుడు దీనికి అర్థం ప్రభువుల్లో ఒకరు. ప్రభువుల్లో సూర్యుడు లాంటి వాడని ఈ బిరుదుని నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్‌కి ఇచ్చారు.

Advertisement

ఇక బహిర్బాగ్ గురించి చూస్తే.. నవాబ్ సర్ అస్మాన్ జహ్ బహదూర్ నిర్మించిన బషీర్ బాగ్ ప్యాలెస్ నుండి వచ్చింది. ఈ ప్యాలెస్ లో అందమైన తోట కూడా ఉండేది ఆ ప్యాలెస్ ని స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కూల్చేసింది. కానీ పేరు అలా ఉండిపోయింది. ఇక బేగంపేట విషయానికి వస్తే… నిజాం కూతురు బషీరున్నీసా బేగం కి పెళ్లి చేసినప్పుడు కట్నం కింద ఈ ప్రాంతంలో చాలా భూములను ఇచ్చేసారు. అందులోని గ్రామమే బేగంపేట. మూడవ నిజాం పేరు సికిందర్ ఝా. సికింద్రాబాద్ ని మొదట లక్ష్సర్ అని పిలిచేవారు. మల్లేపల్లి గ్రామంలోని భూములకి సాగునీటి కోసం ఒక ట్యాంక్ ని నిర్మించిందట.

Advertisement

అలాగే సాహెబా కా తలాబ్ అనేవారట అదే ఇప్పుడు మాసాబ్ ట్యాంక్ గా మారింది. బ్రిటిష్ సైన్యం కోసం సుల్తాన్ బజార్ ని కట్టించారట బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని తిరిగి నిజాం కి ఇచ్చినప్పుడు రెసిడెన్సి బజార్ ని కాస్త సుల్తాన్ బజార్ గా పేరు మార్చారు. నాంపల్లి విషయానికి వస్తే హైదరాబాద్ రాష్ట్రానికి దివాన్‌గా పనిచేసిన రజా అలీఖాన్ యొక్క బిరుదు ‘నేఖ్ నామ్ ఖాన్. జాగీర్ మంజూరు చేసినపుడు నేఖ్-నాంపల్లి అని దాన్ని పిలిచేవారట. లాస్ట్ కి ఇది నాంపల్లిగా మారింది. అబ్బులాహ్ కుతుబ్ షా గోల్కొండ రాజు సేవకుడు మాలిక్ యాకూబ్ పేరు అది. అక్కడ మార్కెట్ ఉండటంతో మలక్‌పేట అనే పేరు వచ్చింది.

Also read:

 

Visitors Are Also Reading