Home » నాగార్జున చేయాల్సిన ప్లాప్ సినిమా బాలయ్య కి ఎలా వచ్చిందంటే ?

నాగార్జున చేయాల్సిన ప్లాప్ సినిమా బాలయ్య కి ఎలా వచ్చిందంటే ?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి నటసింహం, బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే.. ఈయన సాధించిన విజయాలు అలాంటివి మరీ.  ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో బాలయ్య ముందు వరుసలో ఉంటాడు అనే చెప్పవచ్చు.

nagarjuna and Balakrishna

nagarjuna and Balakrishna

సీనియర్ హీరోలలో అయితే వరుసగా మూడు సినిమాలతో రూ.100 కోట్లను కొల్లగొట్టాడు. ప్రస్తుతం కొల్లి బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో వరుసగా నాలుగో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ బాలకృష్ణకు సంబంధించి ఓ వార్త చాలా రోజుల నెట్ లో తెగ హల్ చల్ అవుతుంది.

Advertisement

అదేంటంటే..? అప్పట్లో బాలయ్య హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చేసిన కృష్ణబాబు మూవీలో తొలుత బాలకృష్ణను హీరోగా అనుకోలేదట. తొలుత నాగార్జున ఈ సినిమా చేద్దామని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అనుకున్నప్పటికీ అది నాగార్జునతో వర్కౌట్ అవ్వక బాలయ్య వద్దకు వచ్చింది. బాలకృష్ణ సినిమా చేసి తనఖాతాలో భారీ డిజాస్టర్ ని వేసుకున్నాడు. వాస్తవానికి నాగార్జున చేయాల్సిన ఈ మూవీలోకి బాలయ్య బాబు ఎలా వచ్చాడనేది అప్పుడు ఆశ్చర్యం కలిగించింది. నాగార్జున రిజెక్ట్ చేసిన కథని చేసి బాలయ్య బాబు ఓ భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేశాడు.

Advertisement

నాగార్జున తెలివిగా ఆ ఫ్లాప్ నుంచి తప్పించుకుంటే.. బాలయ్య మాత్రం ఆ ఫ్లాప్ కి బలి  అయిపోయాడు ఆ తరువాత ముత్యాలసుబ్బయ్య దర్శకత్వంలో బాలయ్య మరో మూవీ చేయలేదు. అప్పటి నుంచి బాలయ్య స్టోరీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ చాలా సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. అయినప్పటికీ అవేవి పట్టించుకోకుండా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీస్ సూపర్ హిట్ సాధించాయి. ఇక అదే జోరు కొనసాగించాలని ఆశిద్దాం. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading