కలెక్టర్ ఉద్యోగం అంటే ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంటే తప్ప ఈ ఉద్యోగాన్ని సాధించడం చాలా కష్టం. ఈ క్రమంలో సివిల్స్ లో 37వ ర్యాంకర్ సంజన సింహ వెనక తన భర్త కష్టం ఎంతో దాగి ఉందని తెలియజేస్తోంది.. మరియు ఆమె ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం..? సూర్యవంశం మూవీలో వెంకటేష్ భార్యను కలెక్టర్ చేయడం కోసం ఎంత కష్టపడతారో మనందరికీ తెలిసిందే. అదే తరహాలో సంజన సింహ కలెక్టర్ కావడం కోసం తన భర్త కృషి ఎంతో ఉందని ఆమె చెప్పుకొచ్చింది. నేను ఇంత ర్యాంకు సాధించడానికి కారణం మా హస్బెండ్ హర్ష.
Advertisement
నా వెనుక ఉండి నాకు ఎంతో సహాయం చేస్తూ ఆయన ఎంతో కష్టపడ్డారు కాబట్టే నేను కూడా కష్టపడి చదివి ఈ ర్యాంకు సాధించాలని చెప్పుకొచ్చింది సంజన. ఆమె ప్రధాన ధ్యేయం రైతు ఆత్మహత్యలు రూపుమాపడం, చదువు అనేది పిల్లలకు చాలా ముఖ్యం. పేదరికం వల్ల చదువుకు దూరమైనటువంటి పిల్లలపై దృష్టి పెట్టి వారికి చదువు అందేలా చేయడం, మహిళల ఆరోగ్యంపై కూడా ద్రుష్టి పెడతానని చెప్పుకొచ్చారు సంజన. పెళ్లి తర్వాత కూడా ఆమె ఎంతో కష్టపడి చదివానని, నా చదువు కోసం మా ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదని, నేను ఏమీ చేయలేదని అంతా ఆయనే చూసుకున్నారని, ఈ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది అని అన్నారు.
Advertisement
సంజనా హస్బెండ్ హర్ష మాట్లాడుతూ మా టీం వర్క్ వల్లే ఇదంతా జరిగిందని, మనం ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే మాత్రం మ్యారేజ్, పిల్లలు అనేది ఏ మాత్రం అడ్డుకాదని సంజన దంపతులు అంటున్నారు. సంజన ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు చదవడం రాయడం తప్ప మిగతావన్నీ నేనే చూసుకునే వాడినని ఆయన చెప్పుకొచ్చారు. మా ఇద్దరి కమిట్ మెంట్ వల్లే ఈరోజు ఈ ర్యాంకు సాధించగలిగిందని చెప్పుకొచ్చారు.
also read;
గోపిచంద్ రూ.10వేలు అడగ్గానే వెంటనే గూగుల్ పే చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..?
బాలయ్య సినిమాకు అభిమానులా టైటిల్…!