Home » గోపిచంద్ రూ.10వేలు అడ‌గ్గానే వెంట‌నే గూగుల్ పే చేసిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా..?

గోపిచంద్ రూ.10వేలు అడ‌గ్గానే వెంట‌నే గూగుల్ పే చేసిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా..?

by Anji
Ad

గోపిచంద్ హీరోగా, రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి బ‌న్నివాస్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ల‌లో భాగంగా గోపిచంద్ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొన్నారు. ఓ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న గోపిచంద్‌కు యాంక‌ర్ ఓ టాస్క్ ఇచ్చింది.

Advertisement

టాస్క్ ఏమిటంటే.. మీకు తెలిసిన వాళ్లు ఎవ‌రికైనా కాల్ చేసి కొంత అమౌంట్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌మ‌ని అడిగాలి. ముఖ్యంగా రీజ‌న్స్ ఏమి చెప్ప‌కూడ‌ద‌ని కండిష‌న్లు కూడా పెట్టింది. వెంట‌నే గోపిచంద్ ద‌ర్శ‌కుడు మారుతికి ఫోన్ చేశారు. మారుతి నాకు అర్జెంట్‌గా ఒక 10వేల రూపాయ‌లు కావాలి. మారుతి ఫోన్ 10వేల 10ల‌క్ష‌ల లాగా చెప్పారు అన్న‌. ఓకే ఇప్పుడే చేస్తాన‌ని మారుతి చెప్ప‌డం విశేషం. అదేవిధంగా గోపిచంద్‌కు 10 నిమిషాల స‌మ‌యం ఇచ్చి డ‌బ్బుల‌ను లెక్క‌బెట్ట‌మ‌ని అడగ్గా.. వెంట‌నే గోపిచంద్ డ‌బ్బుల‌ను 30 సెక‌న్ల‌లోనే లెక్కబెట్టారు. రూ.50వేల‌ను 30 సెక‌న్ల‌లో లెక్క‌బెట్ట‌డం చూసి ఆ యాంక‌ర్ ఆశ్చ‌ర్య‌పోయింది. దీంతో ఆమె మీరు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అని అనిపించుకున్నార‌ని గోపిచంద్ ను పొగ‌డ‌డం విశేషం.

Advertisement

ఇటీవ‌లే గోపిచంద్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. మారుతి ద‌ర్శ‌కుడిగానే కాకుండా వ్య‌క్తిగ‌తంగా కూడా నాకు చాలా న‌చ్చార‌ని చెప్పుకొచ్చారు గోపిచంద్‌. ఈ సినిమా టికెట్ ధ‌ర‌లు నాన్ క‌మ‌ర్షియ‌ల్‌గానే ఉంటాయి. కుటుంబ స‌మేతంగా థియేట‌ర్‌కు వెళ్లి ఆనందంగా సినిమాను ఆస్వాదించ‌వ‌చ్చ‌ని తెలిపారు. కామెడీ ప‌రంగా ర‌ణం, లౌక్యం సినిమాల‌ను గుర్తు చేస్తుంద‌ని.. మాస్ యాక్ష‌న్ అంశాల‌తో రూపొందించిన ఓ కుటుంబ క‌థా చిత్రమ‌ని, ప్రేక్ష‌కుల‌ను కడుపుబ్బ న‌వ్విస్తుంద‌ని తెలిపారు గోపిచంద్‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉంది.

Also Read : 

చిరంజీవికి సాయి పల్లవి నో ఎందుకు చెప్పిందో మీకు తెలుసా..?

చాణక్య పాత్ర కోసం పోటీపడ్డ ఎన్టీఆర్, ఏఎన్ఆర్….చివరికి ఆ సినిమా రిజల్ట్ ఏమైందంటే….?

Visitors Are Also Reading