Home » బాలయ్య సినిమాకు అభిమానులా టైటిల్…!

బాలయ్య సినిమాకు అభిమానులా టైటిల్…!

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఆయన వరుసగా చేస్తున్న మాస్ సినిమాలకు ఫ్యాన్స్ కూడా ఉరమాస్ లెవల్ లో ఎంజాయ్ చేస్తారు. అయితే గత ఏడాది చివర్లో అఖండ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు బాలయ్య. బోయపాటి – బాలకృష్ణ కాంబినేషన్ లో వరుసాగా ఇది మూడో సూపర్ సినిమా అనేది అందరికి తెలుసు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస సినిమాలు చేస్తూ ఊపు మీద ఉన్నారు బాలయ్య.

Advertisement

ప్రస్తుతం మంచి మాస్ దర్శకునిగా పేరు తెచుకున్న గోపీచంద్ మలినేనితో సినిమా తీస్తున్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేనితో తీస్తున్న సినిమా ఫస్ట్ లుక్ అనేది విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనేది ఇలాంతకుంటలో జరుగుతుంది. కానీ ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. దాంతో ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అని దర్శక, నిర్మాతలు బాగా ఆలోచిస్తున్నారట. ఎందుకంటే బాలయ్య సినిమా అంటేనే మంచి మాస్ టైటిల్ ఉండాలి.

Advertisement

ఇప్పటికే ఆయనకు సూట్ అయ్యే లయన్, లెజెండ్ వంటి టైటిల్స్ బోయపాటి వాడేశారు. కాబట్టి ఈ సినిమాకు అభిమానులు ఏ టైటిల్ చెబితే అదే పెడదాం అని చిత్ర బృందం అనుకుంటుందట..! అంటే బాలయ్య సినిమా అనగానే ఫ్యాన్స్ కొన్ని టైటిల్స్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. ఈ ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అవి మరి ఎక్కువయై. కాబట్టి అందులో బాగా అనిపించిన టైటిల్ ఒక్క దానిని చూసి…ఈ సినిమాకు పెట్టాలని అనుకుంటున్నారట. దాంతో ఇప్పుడు ఏ టైటిల్ ఎవరి టైటిల్ పెడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇవి కూడా చదవండి :

ఇల్లీగల్ ఫీల్డింగ్ అంటే ఏంటి ? ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఎందుకు..?

సచిన్ తర్వాత ఉమ్రాన్ కోసమే..?

Visitors Are Also Reading