Home » పుష్ప చిత్రంపై హిందీ అగ్ర ద‌ర్శ‌కుడి కామెంట్స్ వైర‌ల్‌..!

పుష్ప చిత్రంపై హిందీ అగ్ర ద‌ర్శ‌కుడి కామెంట్స్ వైర‌ల్‌..!

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప పాన్ ఇండియా సినిమా డిసెంబ‌ర్ 17, 2021 విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందింది. ఇక ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించారు. ఎలాంటి ప్ర‌మోష‌న్లు లేకుండానే హిందీ మార్కెట్‌లో 100 కోట్ల వసూళ్ల‌ను రాబట్టి కేక పెట్టించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను చూసిన హిందీ ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాని సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సుకుమార్‌కు పర్స‌న‌ల్‌గా ఓ మెసేజ్ చేశారు. సినిమాలో ప్ర‌తి సీన్‌, సౌండ్ చాలా బాగున్నాయ‌ని ఇంకా ఇలాంటి సినిమాలు మీరు తీయాల‌ని కుదిరితే మీరు ముంబై వ‌చ్చిన‌ప్పుడు నాకు కాల్ చేయాల‌ని చేసిన హిరానీ మెసేజ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది.


ఇక పుష్ప సినిమా విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. క‌కానీ స్క్రిప్ట్ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కార‌ణంగా లేటు అయింద‌ని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందో అనే విష‌యం ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీని ప్ర‌కారం అయితే జులై చివ‌రి నుంచి షూట్ కు వెళ్ల‌నున్న‌ద‌ని తెలుస్తోంది. కానీ సాధ్య‌మైనంత త‌ర్వ‌లో షూటింగ్ చేసి సంక్రాంతి బ‌రిలో దిగాల‌ని చిత్ర యూనిట్ భావిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

Advertisement

Advertisement

ఇక మ‌రో విశేషం ఏమిటంటే.. అప్పుడే ఈ సినిమాకు సంబంధించి ఓ రేంజ్ లో ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ట‌. పుష్ప‌-2కు సంబంధించి ఇప్ప‌టికే ఇండియా థియేట్రిక‌ల్ ఓటీటీ హ‌క్కులు భారీ ధ‌ర ప‌ల‌క‌గా ఇప్పుడు ఓవర్సిస్ హ‌క్కుల‌పై ఓ వార్త సోష‌ల్ మీడియా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దాని ప్ర‌కారం.. ఈ సినిమాకు ఓవ‌ర్సిస్‌లో ఏకంగా బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ రేంజ్‌లో ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ట‌. ఈ రెండ‌వ పార్ట్‌ను సుకుమార్ దాదాపు రూ.400 కోట్ల‌తో తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా మ‌రీ ఎప్పుడు విడుద‌లవుతుందో వేచి చూడాలి.

Also Read :

సాయి ప‌ల్ల‌వి పెళ్లి చేసుకునేది తెలుగు అబ్బాయినేనా..?

వాట్సాప్‌లో మిమ్మ‌ల్ని ఎవ‌రైనా బ్లాక్ చేశారో లేదో ఇలా తెలుసుకోండి..!

 

Visitors Are Also Reading