Home » వాట్సాప్‌లో మిమ్మ‌ల్ని ఎవ‌రైనా బ్లాక్ చేశారో లేదో ఇలా తెలుసుకోండి..!

వాట్సాప్‌లో మిమ్మ‌ల్ని ఎవ‌రైనా బ్లాక్ చేశారో లేదో ఇలా తెలుసుకోండి..!

by Anji
Ad

సాధారణంగా ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రి వద్ద వాట్సాప్ త‌ప్ప‌కుండా ఉంటుంది. ఈ యాప్ లేనిది మీ స్మార్ట్‌ఫోన్ అస‌లు ఉండ‌దు. నిత్యం వాట్సాప్ వినియోగించే వారు ఎంత మంది ఉంటారో అస‌లు చెప్ప‌లేము కూడా. ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్ చాటింగ్‌ల‌తో మునిగి తేలుతుంటారు. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ప్రతి ఒక్క‌రూ వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఇక అదేవిధంగా యూజ‌ర్ల కోసం వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది.


ఇప్ప‌టికే ఎన్నో ర‌కాల ఫీచ‌ర్స్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ లో మిమ్మ‌ల్ని ఎవ‌రు బ్లాక్ చేశారో తెలుసుకోవాల‌నుకుంటున్నారా అందుకు కొన్ని మార్గాలున్నాయి. ఎందుకంటే వాట్సాప్ లో ప‌లు ప్రైవ‌సీ కార‌ణాల వ‌ల్ల మిమ్మ‌ల్ని ఎవ‌రు బ్లాక్ చేశారో నోటిఫికేష‌న్ రూపంలో తెలుసుకోలేదు. కానీ కొన్ని ప‌ద్ద‌తులను అనుస‌రిస్తే మిమ్మ‌ల్ని ఎవ‌రు బ్లాక్ చేసారో చాలా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవ‌రైనా మిమ్మ‌ల్ని బ్లాక్ చేస్తే ముందు ప్రొపైల్ పిక్చ‌ర్ నుంచే తెలుసుకునే అవ‌కాశ‌ముంది. మీకు వారి ప్రొఫైల్ పిక్చ‌ర్ క‌నిపిస్తే.. అవ‌త‌లి వాళ్లు మిమ్మ‌ల్ని బ్లాక్ చేయ‌న‌ట్టే. క‌నిపించ‌క‌పోతే మాత్రం ఈ ప‌ద్ద‌తుల‌ను పాటించండి.

Advertisement

Advertisement


ఎవ‌రు అయితే మిమ్మ‌ల్ని బ్లాక్ చేశారు అని మీరు అనుకుంటున్నారో వారి లాస్ట్ సీన్‌, ఆన్‌లైన్ స్టేట‌స్ చెక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి. వాళ్లు లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే బ్లాక్ చేయ‌క‌పోయినా క‌నిపించ‌దు. ఆన్‌లైన్ లో ఉన్నా క‌నిపించ‌క‌పోతే క‌చ్చితంగా బ్లాక్ చేసిన‌ట్టే లెక్క‌. ఒక‌వేళ అవ‌త‌లి వ్య‌క్తులు మిమ్మ‌ల్ని బ్లాక్ చేసిన‌ట్ట‌యితే మీకు కేవ‌లం ఒక్క టిక్ మాత్ర‌మే వ‌స్తుంది. రెండు టిక్ మార్కులు బ్లూ టిక్స్ క‌నిపించ‌వు. మీరు మెసేజ్ పెట్టి ఎంత సేపు అయినా ఈ టిక్స్ రాక‌పోతే మిమ్మ‌ల్ని దాదాపు బ్లాక్ చేసిన‌ట్టే అని గుర్తించాలి. అంతేకాదు.. మిమ్మ‌ల్ని బ్లాక్ చేసిన వారికి మీరు కాల్ చేస్తే ఆ కాల్ వారికి వెళ్ల‌దు. అక్క‌డ మీకు రింగ్ బ‌దులు కాలింగ్ అని మాత్ర‌మే వ‌స్తుంది. వాట్సాప్‌లో ఎవ‌రైనా మిమ్మ‌ల్ని బ్లాక్ చేస్తు మీరు గ్రూప్ క్రియేట్ చేయ‌డం కుద‌ర‌దు. ఎవ‌రు అయితే బ్లాక్ చేసార‌ని మీరనుకుంటారో వారితో గ్రూప్ క్రియేట్ చేయ‌డానికి ప్ర‌యత్నం చేయండి. అవ‌త‌లి వారి ప్రొపైల్ పిక్చ‌ర్ డిలీట్ చేసి లాస్ట్ సీన్ హైడ్ చేసి నెట్ ఆఫ్ చేసినా పైవ‌న్నీ జ‌రుగుతాయి. నెట్ ఆఫ్ చేసిన వారు కాసేప‌టికి అయినా ఆన్ చేస్తారు ఇవ‌న్నీ జ‌రిగితే దాదాపు మిమ్మ‌ల్ని బ్లాక్ చేసిన‌ట్టే అనుకోవ‌చ్చు.

Also Read : 

విఘ్నేష్ ఈ స్థాయిలో ఉండటానికి నయనతార మాజీ ప్రియుడే కారణమా…?

బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ సీనియ‌ర్‌ నటీమణి

 

Visitors Are Also Reading