తెలుగులో బిగ్ బాస్ ద్వారా చాలా మందికి పాపులారిటీ వచ్చింది. అప్పటి వరకూ ఎవరికీ తెలియని వారికి కూడా అంతో ఇంతో క్రేజ్ పెరిగింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఆఫర్ లు పెరిగాయి. ఆ లిస్ట్ లో హిమజ కూడా ఒకరు. మొదట హిమజ టీవీ సీరియల్స్ లో నటించింది. అయితే ఆ సమయంలో అసలు హిమజ అంటే ఎవ్వరకీ పెద్దగా పరిచయం లేదు. కాగా ఆ తరవాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని అందుకుంది.
Advertisement
ALSO READ : నవ్వించే బ్రహ్మానందంలో ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడా..! రచ్చ రవి కోసం ఏం చేశాడంటే..?
ఇక బిగ్ బాస్ లో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. చాలా వారాల పాటూ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది. అంతేకాకుండా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరవాత సినిమా ఆఫర్ లను అందుకుంది. ప్రస్తతం సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు మరియు ముఖ్యమైన పాత్రలలో నటిస్తోంది. అదేవిధంగా టీవీ షోలలోనూ సందడి చేస్తోంది.
Advertisement
అయితే హిమజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురుకున్నానని చెప్పింది. కెరీర్ ప్రారంభంలో తనకు బాడీ షేమింగ్ ఎదురయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. కళ్లు భాగోలేవని..నడక మగరాయుడిలా ఉందని కామెంట్ లు చేశారని చెప్పింది. అలా సినిమా ఆఫర్ ల కోసం చాలా అవమానాలు ఎదురుకున్నానని తెలిపింది.
కానీ చేసే పనిలో నిజాయితీ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతామని తెలిపింది. అప్పుడు ట్రోల్ చేసిన వారే నటన చూసి ప్రశంసలు కురిపించారని చెప్పింది. అంతే కాకుండా తను చేసే సామాజికసేవ గురించి యాంకర్ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. సామాజిక సేవ ముందుగా మన ఇంటినుండే మొదలుపెట్టాలని చెప్పింది. అందుకే తాను తన డ్రైవర్ ముగ్గురు కూతుళ్ల చదువుల బాధ్యతలు తీసుకున్నానని స్పష్టం చేసింది.
Advertisement
ALSO READ :Rangamarthanda Teaser : బ్రహ్మానందం విశ్వరూపం.. శ్రద్ధగా చెక్కిన కృష్ణవంశీ!