Telugu News » Blog » Rangamarthanda Teaser : బ్రహ్మానందం విశ్వరూపం.. శ్రద్ధగా చెక్కిన కృష్ణవంశీ!

Rangamarthanda Teaser : బ్రహ్మానందం విశ్వరూపం.. శ్రద్ధగా చెక్కిన కృష్ణవంశీ!

by Bunty
Ads

కృష్ణవంశీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణవంశీ ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సామ్రాట్’ సినిమాలు తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు.

Advertisement

READ ALSO : RRR సినిమాలో ఎన్టీఆర్ ది ఓ సైడ్ పాత్ర – వేణు స్వామి సంచలనం

Advertisement

 

ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు అలానే పాటలు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. దానికి తోడు రీసెంట్ గానే టాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమందికి ప్రీమియర్ షో నిర్వహించాడు కృష్ణవంశీ. ఇక సినిమా చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సింగర్ సునీత కూడా తన సోషల్ మీడియా ద్వారా సినిమాపై, కృష్ణవంశీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

READ ALSO :    NTR నుంచి మనోజ్‌ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్‌ స్టార్లు ?

Director Krishna Vamsi's Rangamarthanda release date out! Leading Telugu production house acquires distribution rights

టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. కృష్ణవంశీ సినిమా అంటే ఎమోషన్స్ అలానే లోతైన భావాలు ఉంటాయి. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే ఎమోషనల్ రైడ్ గా ఉంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వారి పాత్రలో నటించలేదు. ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మీ లోని మరో కోణం ఈ సినిమాలో చూడొచ్చు. రేయ్, నువ్వు ఒక చెత్త నటుడివిరా, మనిషిగా అంతకంటే నీచుడివి అని ప్రకాష్ రాజును బ్రహ్మానందం చెంపదెబ్బ కొట్టడం. నేనొక నటుడిని అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.

Advertisement