Home » న‌వ్వించే బ్ర‌హ్మానందంలో ఇంత గొప్ప వ్య‌క్తి ఉన్నాడా..! ర‌చ్చ ర‌వి కోసం ఏం చేశాడంటే..?

న‌వ్వించే బ్ర‌హ్మానందంలో ఇంత గొప్ప వ్య‌క్తి ఉన్నాడా..! ర‌చ్చ ర‌వి కోసం ఏం చేశాడంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ లో టాప్ క‌మెడియ‌న్ ఎవ‌ర‌ని అడిగితే ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు బ్ర‌హ్మానందం. కామెడీకి బ్ర‌హ్మానందం ఓ బ్రాండ్ లా మారిపోయారు. తెలుగులో వంద‌ల చిత్రాల‌లో ఆయ‌న క‌మెడియ‌న్ గా న‌టించి అభిమానుల‌ను సంపాదించ‌కున్నాడు. కేవ‌లం బ్ర‌హ్మానందం కోస‌మే థియేట‌ర్ కు వెళ్లి సినిమాలు చూసే అభిమానులు ఉన్నారంటే ఆయ‌న రేంజ్ అర్థం చేసుకోవ‌చ్చు.

Advertisement

ప్ర‌స్తుతం ఆయ‌న సినిమాలు చేయ‌డం త‌గ్గించినప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మీమ్స్ రూపంలో న‌వ్విస్తూనే ఉన్నారు. అయితే బ్ర‌హ్మీలో ఎవ్వ‌రికీ తెలియ‌ని యాంగిల్స్ చాలా ఉన్నాయి.ఆయ‌న క‌మెడియ‌న్ మాత్ర‌మే కాకుండా గొప్ప పెయింట‌ర్ కూడా….అంతే కాకుండా ఆయ‌న ఓ మంచి మ‌నిషి అని చాలా మంది చెబుతుంటారు. తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న క‌మెడియ‌న్ ర‌చ్చ‌ర‌వి కూడా అదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు.

ALSO READ : Rangamarthanda Teaser : బ్రహ్మానందం విశ్వరూపం.. శ్రద్ధగా చెక్కిన కృష్ణవంశీ!

Advertisement

రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో ర‌చ్చర‌వి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించారు. బ్ర‌హ్మానందం వ‌ల్ల‌నే తాను ప్ర‌స్తుతం ఈ స్థాయిలో ఉన్నాన‌ని చెప్పారు. జ‌బ‌ర్ద‌స్త్ త‌న‌కు తల్లి లాంటిద‌ని సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డం వ‌ల్లే ఆ షోకు దూరం అయ్యాన‌ని చెప్పారు. డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో షోకు దూరం అవ్వాల్సివ‌చ్చిందని చెప్పారు. ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్న స‌మ‌యంలోనే షో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ఆ స‌మ‌యంలోనే బ్ర‌హ్మానందం గారు పిలిచి ఓ స‌ల‌హా ఇచ్చార‌ని అన్నారు.

ఓ ఇల్లు చూపించి ఇది తీసుకోరా నీకు బాగా క‌లిసివ‌స్తుంద‌ని చెప్పాడ‌ని అన్నారు. ఆ స‌మ‌యంలో చిల్లి గ‌వ్వ కూడా లేక‌పోవ‌డంతో రూ.5ల‌క్ష‌లు కావాల‌న్నా ఇస్తాన‌ని హామీ ఇచ్చాడ‌ని తెలిపారు. బ్ర‌హ్మానందం గారు చెప్పిన‌ట్టే ఆ ఇల్లు తీసుకున్న‌త‌ర‌వాత భాగా క‌లిసివ‌చ్చిందని చెప్పాడు. సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయని..అవార్డులు వ‌స్తున్నాయ‌ని సంతోషం వ్య‌క్తం చేశాడు. న‌టుడిగా అవ‌కాశాలు వ‌స్తుండ‌టంతో ఆర్థికంగా స్థిర‌ప‌డ్డాన‌ని చెప్పాడు.

ALSO READ : Telugu TV Anchors: తెలుగు యాంక‌ర్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..అందరికంటే ఎక్క‌వ ఎవ‌రికంటే..?

Visitors Are Also Reading