Home » ప్ర‌భుత్వ ఉద్యోగులు సెల్ ఫోన్ వాడ‌కం పై హైకోర్ట్ సంచ‌ల‌న ఆదేశాలు..!

ప్ర‌భుత్వ ఉద్యోగులు సెల్ ఫోన్ వాడ‌కం పై హైకోర్ట్ సంచ‌ల‌న ఆదేశాలు..!

by AJAY
Ad

స్మార్ట్ ఫోన్ ప్ర‌పంచంలో ఎక్క‌డ చూసినా ఎవ‌రు చూసినా ఫోన్ ప‌ట్టుకునే కాల‌క్షేపం చేస్తుంటారు. చిన్న‌పిల్ల‌ల నుండి పెద్ద‌వాళ్ల వ‌ర‌కూ ప్ర‌తిఒక్క‌రూ ఫోన్ ల‌కు అతుక్కుపోయి క‌నిపిస్తారు. ఒక్కో ఇంట్లో నాలుగైదు స్మార్ట్ ఫోన్ క‌నిపిస్తుంటాయి. ఇదిలా ఉంటే కొంత మంది ఉద్యోగులు ప‌నివేల‌ళ్లో కూడా ఫోన్ లు వినియోగిస్తుంటారు. కాగా మ‌ధురై లో ఓ మ‌హిళా ఉద్యోగి ప‌నిస‌మ‌యంలో ఫోన్ తో టైమ్ పాస్ చేసుకుంటూ అధికారుల‌కు క‌నిపించింది.

okkadu phone number scene

Advertisement

Advertisement

దాంతో ఆ ఉద్యోగిని స‌స్పెండ్ చేశారు. సస్పెండ్ చేయ‌డంతో స‌ద‌రు ఉద్యోగి మ‌ద్రాసు హైకోర్టును ఆశ్ర‌యించింది. కాగా హైకోర్టు ఈ కేసుపై విచార‌ణ జ‌రిపి నేడు తీర్పును ఇచ్చింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నివేల‌ళ్లో స్మార్ట్ ఫోన్ ల‌తో టైమ్ పాస్ చేయ‌కుండా ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్ర‌భుత్వ ప‌నుల కోసం సెల్ ఫోన్ ను వినియోగించ‌వ‌చ్చ‌ని కానీ ప‌ర్స‌నల్ ప‌నుల కోసం స్మార్ట్ ఫోన్ ల‌ను ప‌నిస‌మ‌యంలో వాడ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

Visitors Are Also Reading