Home » ఆ ఒక్క కారణం తో “లైగర్” సినిమాలో రమ్యకృష్ణ పాత్రను మిస్ చేసుకున్న బ్యాడ్ లక్ నటి ఎవరో తెలుసా..?

ఆ ఒక్క కారణం తో “లైగర్” సినిమాలో రమ్యకృష్ణ పాత్రను మిస్ చేసుకున్న బ్యాడ్ లక్ నటి ఎవరో తెలుసా..?

by AJAY

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి మరియు ఛార్మీ కలిసి నిర్మించారు. దాంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కు క్రేజ్ పెరిగింది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు బాక్సర్ మైక్ టైసన్ కూడా నటించారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ లు విడుదల అయ్యాయి. అంతే కాకుండా సినిమా నుండి పాటలు కూడా విడుదల చేశారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లకు యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూవ్స్ వచ్చాయి. కాగా ఈ సినిమా ట్రైలర్ చూసిన తరవాత నెటిజన్స్ సినిమా అమ్మా నాన్న ఓ తమిల్ అమ్మాయి సినిమా కు సీక్వెల్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

దాంతో విజయ్ దేవరకొండ కూడా ఇప్పటికే ఆ కామెంట్స్ పై స్పందించాడు. ఈ సినిమా సీక్వెల్ కాదని ఆ సినిమా తో ఈ సినిమా కు పోలిక ఉండదని చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమా క్లైమాక్స్ నెవ్వర్ బిఫోర్ అని చెప్పారు. దాంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవర కొండ కు తల్లి గా రమ్య కృష్ణ ముఖ్యమైన పాత్రలో నటించింది.

అయితే ఈ పాత్ర కోసం పూరి ముందుగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ ను అనుకున్నారట. కానీ కథ చెప్పడం లో పూరి జగన్నాథ్ విఫలం అయ్యారట. దాంతో రవీనా ఈ సినిమా కు నో చెప్పారు. దాంతో ఆఫర్ రమ్యకృష్ణ వద్దకు వెళ్ళింది. ఇక ట్రైలర్ చూస్తే రమ్య కృష్ణ పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది.

Also read : సింహాద్రి నుండి ఆర్ఆర్ఆర్ వ‌ర‌కూ జ‌క్క‌న్న ప‌రిచ‌యం చేసిన ఆయుదాలు ఇవే..!

Visitors Are Also Reading