Home » అలాంటి వారికే సినిమా అవకాశాలు.. హీరోయిన్ తాప్సీ ఆసక్తికర కామెంట్స్..!

అలాంటి వారికే సినిమా అవకాశాలు.. హీరోయిన్ తాప్సీ ఆసక్తికర కామెంట్స్..!

by Anji
Ad

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు తెలుగులో అలరించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ అవుతున్నారు. ఇక వీరిలో తాప్సీ ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మందినాదం మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే తన నటనతో, గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత రవితేజతో వరుసగా రెండు సినిమాలలో నటించింది. ప్రభాస్ తో చేసిన మిస్టర్ ఫర్ పెక్ట్ మూవీతో మంచి హిట్ సాధించింది.

Advertisement

తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ కి బాట పట్టింది. అక్కడ పలు అవకాశాలను అందుకుంది. తక్కువ సమయంలోనే హిందీలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అక్కడ లేడీ ఓరియంటేడ్ సినిమాలతో మెప్పించింది. అదేవిధంగా స్టార్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ మాటల యుద్ధం కూడా చేసింది. బాలీవుడ్ లో తాప్సీ పైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసినప్పటికీ అడపాదడపా సౌత్ లో సినిమాలు చేస్తూ.. ఆకట్టుకుంటోంది. తాజాగా తాప్సీ బాలీవుడ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Advertisement

బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసింది తాప్సీ. ఒక సినిమా ఏయే పాత్రలకు ఎవ్వరినీ తీసుకోవాలో కొంతమంది నటీనటులు చేస్తారని పేర్కొంది. టాలెంట్ ఉన్నవాళ్లు క్యారెక్టర్ కి సూట్ అయ్యే వారిని కాకుండా.. తమ స్నేహితులను, ఏజెన్సీ వాళ్లను సిఫారసు చేస్తుంటారని చెప్పుకొచ్చింది తాప్సీ. బాలీవుడ్ లో క్యాంపులు, ఫేవరిటిజం ఉంటాయని తెలిసిందే.. కానీ పక్షపాత ధోరణీ కూడా ఉంటుందని వెల్లడించింది తాప్సీ. ఇటీవలే ప్రియాంక చోప్రా కూడా బాలీవుడ్ పై పలు ఆరోపణలు చేసింది. ఇక ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. తాజాగా తాప్సీ కూడా బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేయడం విశేషం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

టాలీవుడ్ లో సిస్ట‌ర్ సెంటిమెంట్ తో తెర‌కెక్కి ప్రేక్ష‌కుల‌కు కన్నీళ్లు పెట్టించిన సినిమాలు ఇవే..!

ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!

శాకుంతలంలో సమంత గెటప్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా..? ఎంతంటే…?

Visitors Are Also Reading