అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి తరవాత మళ్లీ అలాంటి స్థానం అన్నయ్యదని భావిస్తారు. కాబట్టి టాలీవుడ్ లో కొన్ని సినిమాలలో అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని గొప్పగా చూపించారు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…
Advertisement
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖీ సినిమా అన్నా చెల్లెల్ల నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ సినిమా కృష్ణవంశీ దర్శకత్వం వహించగా సినిమాలోని క్లైమాక్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది.
రాజశేఖర్ హీరోగా నటించిన గోరింటాకు సినిమా కూడా అన్నా చెల్లెల్ల ఆప్యాయతల నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ సినిమాలో మీరాజాస్మిన్ రాజశేఖర్ కు చెల్లెలిగా నటించింది. సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అర్జున్ హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుట్టింటికి రా చెల్లి. ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులు సైతం ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించాయి.
Advertisement
మహేశ్ బాబు సైతం ఓ అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ సినిమాలో నటించాడు. ఆ సినిమా మరోదే కాదు అర్జున్…సినిమాలో తన చెల్లికి వచ్చిన కష్టాల కోసం హీరో పోరాటం చేస్తుంటాడు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమా కూడా అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలోనే
తెరకెక్కింది. భీమినేని శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా మంచివిజయం సాధించింది.
అన్నగారు ఎన్టీఆర్ అన్ని రకాల సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ రక్తసంబంధం అనే సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో నటించారు.
నందమూరి హీరో హరికృష్ణ తక్కవ సినిమాలే చేసినా అవి ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. హరికృష్ణ చేసిన సినిమాలలో శివరామరాజు కూడా ఒకటి. ఈ సినిమా సైతం సిస్టర్ సెంటిమెంట్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
హీరో గోపీచంద్ భార్యను ఎప్పుడైనా చూశారా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
పోతినేని రామ్ పెళ్లి చేసుకోబోతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?