Home » శాకుంతలంలో సమంత గెటప్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా..? ఎంతంటే…?

శాకుంతలంలో సమంత గెటప్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా..? ఎంతంటే…?

by AJAY

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హీరోలకు జోడీగా నటించడమే కాకుండా లేడి ఓరియంటెడ్ సినిమాలలోనూ నటిస్తోంది. రీసెంట్ గా సమంత యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకుంది. కాగా తాజాగా శాకుంతలం అనే మరో లేడీ ఓరియంటెడ్ సినిమాతో సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతోంది.

ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. సినిమాలో సమంత ముఖ్యమైన పాత్రలో సమంత నటించగా పౌరాణిక ప్రేమ కథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సమంత లుక్ ప్రేక్షకులను ఫిదా చేసింది.

గతంలో కంటే శాకుంతలం లో సమంత ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే ఆ గెటప్ కోసం దర్శకుడు గుణశేఖర్ ఎంతో కష్టపడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో నిజమైన బంగారాన్ని వాడినట్టు సమాచారం. అంతేకాకుండా ఆ బంగారం విలువ దాదాపు మూడు కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఈ సినిమాకు నీతా లూల్లా స్టైలిస్ట్ గా వ్యవహరించారు. అంతేకాకుండా సమంత 30 కిలోల చీరను ధరించినట్టు తెలుస్తోంది. ఇక ఈ చీర కోసం ఒరిజినల్ ముత్యాలను ఉపయోగించడంతో ఆ చీర బరువు పెరిగిందని తెలుస్తోంది. మరి సమంత గెటప్ కోసమే అంత ఖర్చు చేయగా…. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా విడుదల అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.

Also read : Pooja Hegde : పూజ హెగ్డే ఇంట పెళ్లి సందడి… బుట్ట బొమ్మ ఎమోషనల్ నోట్

Visitors Are Also Reading