Home » ఒక‌ప్ప‌టి హీరోయిన్ ల‌య ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తుందో తెలుసా..? జీతం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..?

ఒక‌ప్ప‌టి హీరోయిన్ ల‌య ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తుందో తెలుసా..? జీతం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..?

by AJAY
Ad

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లుగా రానించిన వారిలో ల‌య కూడా ఒక‌రు. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో లయ హీరోయిన్ గా న‌టించి అలరించింది. ప‌క్కంటి అమ్మాయిలా క‌నిపిస్తు అభిమానులు సంపాదించుకుంది. అమాయ‌క‌మైన ముఖం మరియు ఆమె అందానికి ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. కేవ‌లం అందంతోనే కాకుండా త‌న న‌ట‌న‌తోనూ మెప్పించింది.

ALSO READ : రాహుల్ కు ఇందిరా గాంధీకి పట్టిన గతే.. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన ట్వీట్

Advertisement

heroine-laya-family

ల‌య మొద‌ట‌గా స్వ‌యంవ‌రం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అంతే కాకుండా మొద‌టి సినిమాతోనే అభిమానుల‌ను సంపాదించుకుంది. ఈ సినిమా త‌ర‌వాత మ‌నోహ‌రం, ప్రేమించు సినిమాల‌లో హీరోయిన్ గా న‌టించింది.అంతే కాకుండా ఈ సినిమాల‌లో త‌న న‌ట‌న‌కు గానూ ల‌య వ‌రుస‌గా మూడు సార్లు నంది అవార్డులను అందుకుంది.

Advertisement

అలా వ‌రుస‌గా మూడు నంది అవార్డులు అందుకున్న హీరోయిన్ గా సైతం ల‌య రికార్డు క్రియేట్ చేసింది. అయితే వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్న స‌మ‌యంలోనే ల‌య సినిమాల‌కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది. ఇక ప్ర‌స్తుతం ఫ్యామిలీతో క‌లిసి ల‌య అమెరికాలో ఉంటుంది. అయితే అమెరికాలో ఉంటున్నప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న ఫోటోల‌ను మ‌రియు ఫ్యామిలీ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక రీసెంట్ గా ల‌య ఓ మీడియా ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన విష‌యాల‌ను పంచుకుంది. 2011 నుండి తాను ఐటీ సెక్టార్ లో ప‌నిచేసిన‌ట్టు తెలిపింది. ఇండియాకు చెందిన ప్ర‌ముఖ ఐటీ సంస్థ‌లో ప‌నిచేశాన‌ని చెప్పింది. 2017 వ‌ర‌కూ ఐటీలో ఉద్యోగం చేశాన‌ని సంవ‌త్స‌రానికి 9,60000 జీతం తీసుకున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది.

ALSO READ : రెమ్యున‌రేష‌న్ పై స‌మంత సంచ‌ల‌న వ్యాక్య‌లు…అది చూసి ఇవ్వాలంటూ..!

Visitors Are Also Reading