Home » రెమ్యున‌రేష‌న్ పై స‌మంత సంచ‌ల‌న వ్యాక్య‌లు…అది చూసి ఇవ్వాలంటూ..!

రెమ్యున‌రేష‌న్ పై స‌మంత సంచ‌ల‌న వ్యాక్య‌లు…అది చూసి ఇవ్వాలంటూ..!

by AJAY

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. తెలుగుతో పాటూ త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స‌మంత సినిమాలు చేస్తోంది. కేవ‌లం సినిమాల‌లోనే కాకుండా వెబ్ సిరీస్ ల‌లోనూ స‌మంత న‌టిస్తోంది. పుష్ప సినిమాలో స్పెష‌ల్ సాంగ్ తో స‌మంత అల‌రించింది. స‌మంత స్టెప్పులు వేసిన స్పెష‌ల్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.

ALSO READ  :రాహుల్ కు ఇందిరా గాంధీకి పట్టిన గతే.. ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన ట్వీట్

అనారోగ్యం నుండి కోలుకున్న త‌ర‌వాత స‌మంత తిరిగి సినిమా షూటింగ్ ల‌లో పాల్గొంటుంది. ఇక ఇప్ప‌టికే స‌మంత శాకుంత‌లం సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విడుద‌లకు సిద్దంగా ఉంది. ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రానికి గుణశేఖ‌ర్ దర్శ‌క‌త్వం వ‌హించ‌గా పౌరాణిక క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఇదిలా ఉంటే తాజాగా స‌మంత రెమ్యున‌రేష‌న్ విష‌యం పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసింది. ఇంట‌ర్వ్యూలో రెమ్యున‌రేషన్ గురించి స‌మంతను ప్ర‌శ్నించ‌గా….క‌ష్టాన్ని చూసి దానికి త‌గ్గ‌ట్టుగా పారితోషికం ఇస్తే బాగుంటుంద‌ని స‌మంత అన్నారు. నా శ్ర‌మ చూసి మేము మీకు ఇంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల‌నుకుంటున్నాం అని నిర్మాత‌లే చెప్పాలి.

అంతే గానీ నాకు ఇంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల‌ని నేను అడుక్కోవాల్సిన అవ‌స‌రం లేదన్నారు. మ‌న కృషి ఆధారంగా ఇదంతా వ‌స్తుంద‌ని న‌మ్ముతాన‌ని…మ‌న సామ‌ర్ధ్యాల‌ను పెంచుకుంటూ పోవాల‌ని స‌మంత వ్యాఖ్యానించింది. ఇక స‌మంత చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ALSO READ :Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!

Visitors Are Also Reading