ప్రధాని మోదీ ఇంటి పేరుపై జరిగిన రచ్చ సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్ష వరకు దారితీసింది. అనంతరం లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంటు రద్దుచేసింది. ఎప్పుడైతే ఎంపీ సభ్యత్వం రద్దు అయిందో వెనువెంటనే తుగ్లక్ లేన్ 12 లో ఉన్న బంగ్లా ఖాళీ చేయాలంటూ ఎవిక్షన్ నోటీసు పంపింది లోక్ సభ హోసింగ్ ప్యానెల్. ఒకదాని తరువాత ఒకటిగా ఎదురవుతున్న సమస్యల్ని, ఇబ్బందుల్ని రాహుల్ గాంధీ హుందాగా స్వీకరిస్తున్నారు.
Advertisement
READ ALSO : Ravanasura Trailer : అదరగొట్టిన మాస్ మహారాజ్..గత్తర్ లేపిన “రావణాసుర” ట్రైలర్
అయితే తాజాగా రాహుల్ గాంధీపై కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్ లో రాహుల్ పై అనర్హత వేటు పై వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేస్తూ, ‘రాజకీయాల్లో అర్హత లేని నేత రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం అది అధికారికంగా రుజువైంది’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Advertisement
అంతేకాకుండా గతంలో ఇందిరా గాంధీపై కూడా అనర్హత వేటు పడిందని ఆయన గుర్తుచేశారు. అయితే ఆమె నిజాయితీగల నేత కాబట్టి తిరిగి అగ్రనేతగా నిలదొక్కుకున్నారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వలేమితో కొట్టు మిట్టాడుతోంది. పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. అయితే ఇందిరాగాంధీ కనక కశ్మీర్ ను కాపాడి ఉంటే.. తాను కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసే వాడిని కాదు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
read also : TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!
My comments on the debate on Rahul Gandhi’s India bashing in USA. @republic #RahulShocksIndia pic.twitter.com/46sVjbKS72
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 25, 2017
Advertisement