Home » లైగర్ సినిమా ప్లాప్ అయితే.. జర్నలిస్ట్ ప్రశ్నకు హీరో విజయ్ ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ ఏంటంటే..?

లైగర్ సినిమా ప్లాప్ అయితే.. జర్నలిస్ట్ ప్రశ్నకు హీరో విజయ్ ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొద్ది రోజులుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు.. ఇక సినిమా రావడానికి ఎంతో సమయం కూడా లేదు.. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విపరీతంగా చేస్తోంది. దీనికోసం దేశమంతా తిరుగింది.. నార్త్ నుంచి మొదలు సౌత్ వరకు అన్ని పెద్ద నగరాల్లో మూవీ ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ముంబై మీడియాతో ముచ్చటించింది. ఆ ఇంటర్వ్యూ లో ఒక జర్నలిస్టు హీరో విజయ్ దేవరకొండను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు.. దీంతో విజయ్ కోపానికి రాకుండా సమాధానమిచ్చారు.. అదేంటంటే..

Advertisement

also read:పిలిచి ఉద్యోగం ఇచ్చింది.. ఆ త‌రువాత అత‌నికి భార్య‌గా మారింది..!

ఒకవేళ లైగర్ మూవీ ఫ్లాప్ అయితే ఎలా అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించారు.. దీనికి విజయ్ సమాధానం ఇస్తూ .. నేను మీరు అడిగిన ప్రశ్నకు కోపం తెచ్చుకోను.. ఈ ప్రశ్న నన్ను కొన్ని సంవత్సరాల కింద అడిగి ఉంటే కోపం వచ్చేది కావచ్చు.. మీపై విరుచుకు పడే వాడినేమో.. అప్పట్లో నాకు కోపం ఎక్కువగా ఉండేది.. కానీ గత కొద్ది రోజులుగా నాకు అసలు కోపమే రావడం లేదు.. దీనికి ప్రధాన కారణం అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమ.. అది నన్ను పూర్తిగా కోపానికి దూరం చేసింది.. ఈ విధంగా చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని నా అభిమానులను నేను అగౌరవపరిచలేను అంటూ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు.

Advertisement

ప్రమోషన్స్ కొరకు మేము దేశమంతా తిరుగుతూ ఉంటే అభిమానులు మాపై చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం అన్నారు. నాకు ముఖ్యమైనవి ఆడియన్స్ మాత్రమే అని అన్నారు. వారి కోసం ఏ పనైనా చేస్తాను అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.. అతని మాటలు విన్న వారంతా షాక్ అయ్యారు.. ఆ ప్లేస్ లో మిగతా హీరో ఎవరైనా ఉంటే మాత్రం ఆ ప్రశ్నకు తప్పనిసరిగా కోపానికి వచ్చేవారు.. కానీ విజయ్ దేవరకొండ వ్యవహరించిన తీరు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.. దీంతో అతనిపై మరింత అభిమానం పెరుగుతుంది అంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

also read:వెంకటేష్ భార్య నీరజ గార్ల పెళ్లి వెనుకున్న అసలు కథ..! భార్యని ఎందుకు బయటకి తీసుకురారంటే ?

 

Visitors Are Also Reading