Telugu News » వెంకటేష్ భార్య నీరజ గార్ల పెళ్లి వెనుకున్న అసలు కథ..! భార్యని ఎందుకు బయటకి తీసుకురారంటే ?

వెంకటేష్ భార్య నీరజ గార్ల పెళ్లి వెనుకున్న అసలు కథ..! భార్యని ఎందుకు బయటకి తీసుకురారంటే ?

by AJAY MADDIBOINA

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా ఎంతో గుర్తింపు సాధించిన హీరో వెంక‌టేష్. ఫ్యామిలీ సినిమాలు చేస్తూ లేడీ ఫ్యాన్స్ ను సంపాదించుకోవ‌డంతో వెంక‌టేష్ కు ఆ గుర్తింపు ద‌క్కింది. సినిమాల్లోనే కాకుండా వెంక‌టేష్ నిజ‌జీవితంలోనూ ఫ్యామిలీ మ్యాన్ అన‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు. వెంక‌టేష్ పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి రూమర్స్ లేవు. చాలా మంది హీరోల భార్య‌లు సోష‌ల్ మీడియాలో సినిమా ఈవెంట్ ల‌లో క‌నిపిస్తుంటారు.

Ads

పిల్ల‌లు అయితే చిన్న‌వ‌య‌సులోనే సెల‌బ్రెటీలుగా మారిపోయి ఫోజులు కొడ‌తారు కానీ వెంక‌టేష్ భార్య పిల్ల‌లు ఎవ‌రో కూడా ప్రేక్ష‌కుల‌కు తెలియదు. వాళ్లు మీడియాకు సోష‌ల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఇక వెంక‌టేష్ భార్య గురించి చాలా మందికి తెలియ‌దు. ఆమె ఎవ‌రు వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటి అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం… వెంక‌టేష్ భార్య పేరు నీర‌జ‌రెడ్డి కాగా ఆమె చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లిలో జ‌న్మించారు.

నీర‌జారెడ్డి తండ్రి సుబ్బారెడ్డి బ‌డా వ్యాపార‌వేత్త మ‌రియు ఆయ‌న‌కు సినిమా థియేటర్ లు ఉన్నాయి. ఇక వెంక‌టేష్ తండ్రి డి రామానాయుడు సంబంధాలు వెతుకుతున్న స‌మ‌యంలోనే నీర‌జారెడ్డికి కూడా ఆమె తండ్రి సంబంధాలు చూస్తున్నాడు. అయితే నీర‌జా రెడ్డి బంధువు అయిన నాగిరెడ్డికి రామానాయుడు వెంక‌టేష్ కు సంబంధాలు చూడ‌మ‌ని చెప్పారు. దాంతో నాగిరెడ్డి మా బంధువుల అమ్మాయి ఉంది కానీ మీ కులం కాదు అంటూ స‌మాధానం ఇచ్చారు. దానికి రామానాయుడు నాకు కులం ప‌ట్టింపులు లేవు…అన‌డం ఆ త‌ర‌వాత పెళ్లి జ‌రిగింద‌నేది ప్రచారంలో ఉన్న వార్త కానీ ఇది నిజం కాదు.

రాయ‌ల‌సీమ‌లోని మ‌ద‌న‌పల్లిలో ఏకులం వారైనా పేరు చివ‌రరెడ్డి అని పెట్టుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ట‌. మ‌ద‌న‌ప‌ల్లి కొండ‌పై రెడ్డ‌మ్మ అనే దేవ‌త ఉండ‌టంతో ఆ అమ్మవారి భ‌క్తులంతా పేరు చివ‌ర‌న రెడ్డి అని త‌గిలించుకుంటార‌ట‌. నిర‌జారెడ్డి కూడా కాపు కులానికే చెందిన‌వారు కాగా నాగిరెడ్డి స‌ల‌హామేర‌కు రామానాయుడు వెంక‌టేష్ తో క‌లిసి ఆమెను చూసి సంబంధం కాయం చేసుకున్నారు. ఇక నిర‌జారెడ్డికి సినిమా ఫంక్ష‌న్ ల‌కు రావడం ఇష్టం ఉండ‌ద‌ట‌.


You may also like