Telugu News » Blog » పిలిచి ఉద్యోగం ఇచ్చింది.. ఆ త‌రువాత అత‌నికి భార్య‌గా మారింది..!

పిలిచి ఉద్యోగం ఇచ్చింది.. ఆ త‌రువాత అత‌నికి భార్య‌గా మారింది..!

by Anji
Ads

సాధారణంగా అదృష్టం అనేది ఎవరి తలరాతను ఎప్పుడు ఎలా మారుస్తుందో అసలు ఎవ్వ‌రూ కూడా ఊహించరు. ఇలా అలా మారుతుందని చెప్పడం కూడా ఎవ్వరి తరం కాదు. కొందరి జీవితాలు అనుకోకుండా మలుపులు తిరిగితే.. మ‌రికొంద‌రి జీవితాలు మరోలా మారిపోతాయి. ఈ సందర్భాల్లో కిళ్లి కొట్టు నడుపుకునే వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవుతాడు. ఆటో డ్రైవర్ కు లక్షల రూపాయ‌ల ల్యాట‌రీ త‌గ‌ల‌డం లాంటివి మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి మాదిరిగానే ఒక అదృష్టవంతుడి కథ గురించి మనం తెలుసుకుందాం.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  వెంకటేష్ భార్య నీరజ గార్ల పెళ్లి వెనుకున్న అసలు కథ..! భార్యని ఎందుకు బయటకి తీసుకురారంటే ?

 

అత‌నికి 20 ఏళ్ల వయసు ఉంది. ఆ యువ‌కుడు ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు. రోజు మొత్తం ఆటో నడిపితే కానీ అతనికి పూట గడిచేది కాదు. ఆ రోజంతా అన‌గా ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ఆటో నడిపి ఆ రాత్రికి ఆటోను యజమానికి అప్పగించే వాడు. ఇలా అత‌ను ప‌డుతున్న క‌ష్టాన్ని చూసి త‌న‌కు తెలిసిన ఒక వ్య‌క్తి ఇలా పొద్దంతా ఆటో న‌డిపి క‌ష్ట‌ప‌డే కంటే త‌న‌కు తెలిసిన ఓ మొబైల్ క్యాంటిన్ ట్ర‌క్ న‌డిపేందుకు వెళ్ల‌మ‌ని ఒక స‌ల‌హా ఇచ్చాడు. కేవ‌లం సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి గంట‌ల వ‌ర‌కు ఉంటే చాలు అని చెప్ప‌డంతో ఇత‌ను జాయిన్ అయ్యాడు. ఇక క్యాంటిన్ న‌డుపుతున్న ఆమెకు 50 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉంటుంది. ఆమె టిఫిన్స్ మాత్ర‌మే చేస్తుంది. ఆమె 18 ఏండ్ల కూతురు వాటిని అమ్ముకొని వస్తుంది. ఇలా వారికి అత‌ను సాయం చేస్తూ వారి వ‌ద్ద‌నే ప‌ని చేస్తున్నాడు. ట్ర‌క్ న‌డుపుతున్న స‌మ‌యంలో పెద్దావిడ కూతురితో ఇత‌నికి చ‌నువు బాగా పెరిగిపోయింది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోయారు. పెళ్లి చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్నారు.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  బాదం గింజ‌ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మీకు ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయో తెలుసా..?

Advertisement

ఈ తరుణంలోని అత‌నికి ఆ పెద్దావిడ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. అది ఏమిటంటే త‌న కూతురిని పెళ్లి చేసుకోవాల‌ని కోరింది. అప్ప‌టికే వారిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న విష‌యం మాత్రం ఆమెకు తెలియదు. ఈ విష‌యం విన్న వెంట‌నే మ‌నోడు ఎగిరి గంతేశాడు. ఇంకా ఏముంది ఆరు నెల‌లు తిర‌గ‌కుండానే వారిద్ద‌రికీ పెళ్లి జ‌రిగింది. అలా వారిద్ద‌రూ క‌లిసి క్యాంటిన్ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. ఎంత‌లా అంటే క్యాంటిన్ న‌డిపిన చోట‌నే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం వీరి వ్యాపారం చాలా బాగా పెరిగిపోయింది. ఇక అత‌ని అత్త ఇప్పుడు మృతి చెందింది. ఈ విధంగా ఆ వ్య‌క్తి అనుకోకుండా ల‌క్ త‌గిలి కోటీశ్వ‌రుడు అయ్యాడు.

ఇవి కూడా చ‌ద‌వండి :  హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రోజా కూతురు.. ఆ స్టార్ హీరో వారసుడితోనేనా..?