Telugu News » Blog » టాలీవుడ్ లో క్రమశిక్షణ తప్పింది అంటున్న హీరో సుమన్..!

టాలీవుడ్ లో క్రమశిక్షణ తప్పింది అంటున్న హీరో సుమన్..!

by Manohar Reddy Mano
Ads
టాలీవుడ్ లో హీరోగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత కనిపించకుండా పోయిన వారు చాలా మంది ఉన్నారు. అందులో ప్రముఖ  హీరో సుమన్ కూడా ఒక్కరు. 2000 సంవత్సరం కంటే ముందు సమయంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన సుమన్ ఆ ఆతర్వాత దేవుడి పత్రం చేసారు. కానీ ఇప్పుడు అవి కూడా ఆపేసారు. ఆయన ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయిన కూడా మన టాలీవుడ్ విషయాలలో ఆయన స్పందిస్తూ ఉంటారు.
ఇలా తాజాగా టాలీవుడ్ లో క్రమశిక్షణ తప్పింది అంటూ హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ నెల 30న టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ… దాసరి గారు మన ఇండస్ట్రీ పెద్దగా ఉన్నప్పుడు… హీరోల కంటే బయ్యర్ల గురించే ఎక్కువగా ఆలోచించేవారు.
ఒకవేళ ఏ సినిమా కారణంగానైనా బయ్యర్లు నష్టపోతే తర్వాత సినిమా వారికీ ఫ్రీగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆలా లేదు. బయ్యర్ల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ప్రస్తుతం ప్రతి సినిమా కోట్లలో ఖర్చు చేసి తీస్తున్నారు. బయ్యర్లు కూడా అదే మొత్తంలో ఖర్చు చేసి కొంటున్నారు. కానీ అలంటి సినిమాల్లో ఏదైనా ప్లాప్ అయితే వారు భారీగా నష్టపోతున్నారు. అసలు వారి గురించి ఆలోచించే వారే ఇప్పుడు మన టాలీవుడ్ లో లేరు అని సుమన్ అన్నారు. అలాగే ఈ మాటలు అన్ని నేను యెహో ఆవేశంలో అంటునవి కావు అని.. ఇవ్వని నిజాలే అని ఆయన చెప్పడం కోసం మెరుపు.