Home » ఈ ఐపీఎల్ లో బట్లర్ సంపాదన ఎంతో తెలుసా…?

ఈ ఐపీఎల్ లో బట్లర్ సంపాదన ఎంతో తెలుసా…?

by Azhar
Ad
ఐపీఎల్ 2022 సీజన్ మొత్తం ధాటిగా.. దూకుడుగా ఆడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం బట్లర్ మాత్రమే. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఏకంగా నాలుగు సెంచరీలు చేసి తన జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్ కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించిన బట్లర్ డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. అయితే ఈ ఐపీఎల్ 2022 మెగా వేలం కంటే ముందు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం బట్లర్ ను 10 కోట్ల భారీ మొత్తంతో రిటైన్ చేసుకుంది. కానీ ఈ 10 కోట్లు మాత్రమే కాకుండా బట్లర్ ఇంకా బాగానే సంపాదించాడు.
తాజాగా ముగిసిన ఐపీఎల్ 2022 ఫైనల్స్ అనంతరం ప్రకటించిన అవార్డులలో బట్లర్ ఒక్కడే ఆరు అవార్డులు గెలుచుకున్నాడు. ఈ సీజన్ లో 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దకించుకోవడం మాత్రమే కాకుండా…. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, గేమ్ చేంజర్, మ్యాగ్జిమమ్ ఫోర్స్, మ్యాగ్జిమమ్ సిక్సెస్, పవర్ ప్లే ప్లేయర్ అంటూ ఇలా ఆరు అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఈ ఒక్కో అవార్డుకు 10 లక్షల చొప్పున మొత్తం 60 లక్షలను అందుకున్నాడు. అంతే కాకుండా క్వాలిఫైర్ 2 లో సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు 5 లక్షలు తీసుకున్నాడు. ఇక్కడికి మొత్తం 65 లక్షలు.
అలాగే లీగ్ స్టేజ్‌లో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న బట్లర్ వీటి ద్వారా 2 లక్షలు సాధించాడు. అలాగే సీజన్ మొత్తం బీకర ఫామ్ లో ఉన్న బట్లర్ ఆ మ్యాచ్ లలో మోస్ట్ ఫోర్స్, మోస్ట్ సిక్సెస్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, పవర్ ప్లేయర్, గేమ్ చేంజర్, సూపర్ స్ట్రైకర్ ఇలా ఉన్న అన్ని రకాల అవార్డులను 28 అందుకొని.. అవార్డుకు లక్ష చొప్పున మరో 28 లక్షలు ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ అన్ని అవార్డుల అన్ని పైసలను కలిపితే మొత్తం 95 లక్షలు అవుతుంది. అంటే వేలంలో చాల మంది ఆటగాళ్లుగా అమ్ముడుపోయిన ధర కంటే ఈ పైసలే ఎక్కువ అని చెప్పాలి.

Advertisement

Visitors Are Also Reading