Home » ఆ మూవీ తీయాలని హీరో కృష్ణ తల్లి చివరి కోరిక.. కానీ మూవీ100 రోజుల ఫంక్షన్ కి ముందే అలా కావడం దారుణం..!!

ఆ మూవీ తీయాలని హీరో కృష్ణ తల్లి చివరి కోరిక.. కానీ మూవీ100 రోజుల ఫంక్షన్ కి ముందే అలా కావడం దారుణం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు ఉండరు.. అలనాటి హీరోల్లో ఒకరైన కృష్ణ ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ స్టార్ గా మారారు.. అలాంటి కృష్ణ తల్లి ఒక సినిమా తీయాలని చివరి కోరిక అడిగిందట.. దీనికోసం కృష్ణ ఏం చేశారో ఇప్పుడు చూద్దాం..1952లో తెనాలి పట్టణానికి సమీపంలో బుర్రిపాలెం గ్రామస్తుడైన ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు ప్రథమ పుత్రుడు కృష్ణ. వీరిది అప్పట్లో రైతు కుటుంబం. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణ మూర్తి కాగా, సినిమాల్లోకి వచ్చాక ఈ పేరు కృష్ణ గా మారింది. అలాగే కృష్ణ కు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోకి రావడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు. ఆయనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

Advertisement

also read;భ‌ర్త బ‌ర్త్ డే రోజు షాకింగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా..!

అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు, గూడచారి 116, వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి స్టార్ హోదా సంపాదించుకున్నారు. ఈ తరుణంలోనే కృష్ణ తల్లి నాగరత్నమ్మకు ముగ్గురు కొడుకులు కావడంతో, ముగ్గురు కొడుకులు అనే టైటిల్ తో ఒక సినిమా తీసుకురావాలని ఆమె కోరిందట. దీనికోసం ముగ్గురు కొడుకులు చిత్రాన్ని కూడా రిజిస్టర్ చేయించిందట. కథ కోసం చాలామందిని సంప్రదించారు, అలా ఏడాది సమయం గడిచిన కథ ఎవరు తయారు చేయలేదు. చివరికి పరుచూరి బ్రదర్స్ ను కృష్ణ పిలిపించి కథ తయారు చేయాలి చెప్పడంతో వారు ఒక కథ తయారు చేసి కృష్ణకు చెప్పారు..

Advertisement

కానీ అది నచ్చకపోవడంతో, ఆ తర్వాత దర్శకుడు బి సి రెడ్డి చెప్పిన లైన్ కృష్ణ కి బాగా నచ్చడంతో ఊటీ బ్యాక్డ్రాప్లో కథను సిద్ధం చేశారు. ఈ సినిమాకి సంభాషణలు రాసె బాధ్యత పరుచూరి బ్రదర్స్ తీసుకున్నారు. ఈ చిత్రంలో కృష్ణ,రమేష్ బాబు, మహేష్ బాబు ముగ్గురు అన్నదమ్ములు గా నటించారు. వీరికి తల్లిదండ్రులుగా గుమ్మడి, అన్నపూర్ణమ్మ నటించారు. కృష్ణ సరసన కథానాయికగా గ్లామర్ క్వీన్ రాధా, రమేష్ బాబు సరసన బాలీవుడ్ నటి సోనమ్ నటించారు. ఇందులో మహేష్ బాబు ఒక సన్నివేశంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించి నటనతో అదరగొట్టేసారు. పద్మాలయ బ్యానర్ పై ఘట్టమనేని నాగరత్నమ్మ నిర్మాణంలో కృష్ణ స్వీయ దర్శకత్వంలో 1988 అక్టోబర్ 20వ తేదీన ముగ్గురు కొడుకులు చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా విజయం సాధించినందుకు తల్లి నాగరత్నమ్మ ఎంతో ఆనందించింది కానీ వంద రోజుల ఫంక్షన్ వరకు ఆమె కన్నుమూసింది.

also read:ఎన్టీఆర్ పై ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. నెటిజ‌న్లు ట్రోల్స్‌..!

Visitors Are Also Reading