Home » భ‌ర్త బ‌ర్త్ డే రోజు షాకింగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా..!

భ‌ర్త బ‌ర్త్ డే రోజు షాకింగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా..!

by Anji
Ad

బాలీవుడ్ యాక్ట‌ర్ ప్రియాంక చోప్రా గురించి దాదాపు అంద‌రికీ తెలిసే ఉంటుంది. ప్ర‌స్తుతం ఈమె అమెరికాలో ఉంటుంది. భార‌త్‌ను పూర్తిగా వ‌దిలేసి మ‌కాం మార్చేసింది. ఆమె బంధువులు, పేరెంట్స్ మాత్రం ఇక్క‌డే ఉంటున్నారు. ఒక‌ప్పుడు బాలీవుడ్ లో త‌న స‌త్తా చాటిన ప్రియాంక ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా పాప్ సింగ‌ర్ నిక్ జ‌న‌స్‌ను పెళ్లి చేసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చింది. పెళ్లి త‌రువాత తన భ‌ర్త‌తో పాటు అక్క‌డే ఉంటోంది. ప్రియాక నిక్ కంటే ప‌దేళ్ల పెద్ద అనే విష‌యం తెలిసిందే. ప్రియాంక చోప్రా నిక్‌ను పెళ్లి చేసుకోవ‌డానికి ముందు ఒక ఇంగ్లీషు ఆల్బ‌మ్ చేసింది.

Advertisement

ఇక ఆ త‌రువాత క్వాంటికో సిరిస్ చేసింది. అక్క‌డ సూప‌ర్ హిట్ అయింది. అందులో నిక్ కూడా న‌టించాడ‌ట‌. ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ ప్రియాంక వ‌య‌సులో త‌న‌కంటే చిన్న‌వాడిని పెళ్లి చేసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సినిమాల‌ను మానేసి హాలీవుడ్‌లో సెటిల్ అయింది. హాలీవుడ్ యాక్ట‌ర్స్‌తో సినిమా చేస్తుంది. ఇక నిక్ ఓ వైపు ఆల్బ‌మ్స్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్నాడ‌ట‌. ఇటీవ‌లే వీరికి సంతానం కూడా క‌లిగింద‌ని వార్త‌లు వినిపించాయి.

Advertisement

Also Read :  ర‌జినీ జైల‌ర్ మూవీ నుంచి త‌ప్పుకున్న ప్రియాంక మోహ‌న్ ఎందుకో తెలుసా..?

ప్రియాంక త‌న క‌డుపులో పుట్టిన వారు కాదంట‌. ఒక‌రు స‌రోగ‌సీ ద్వారా, మ‌రొక‌రు ద‌త్త‌త తీసుకున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. తాజాగా త‌న భ‌ర్త పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రియాంక నిక్ జోన‌స్‌కి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేసింద‌ట‌. చివ‌రకు ఏ విష‌యం చెప్ప‌కుండా ప్రైవేట్ ప్లైట్ లో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసింద‌ట‌. దీనికి సంబంధించిన వీడియోను నిక్ ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. అది చూసిన వారంద‌రూ వావ్ స‌ర్‌ప్రైజ్ బాగుంద‌ని కామెంట్ చేస్తుంటే మ‌రికొంద‌రూ ప్రియాంకకు 40 వ‌చ్చాయి. నువ్వు మాత్రం ఇంకా 30లోనే ఉన్నావు అని సెటైరిక‌ల్ గా ట్రోల్స్ చేస్తున్నార‌ట నెటిజ‌న్లు.

Also Read :  దాసరి లేకుండానే 3 పాటలను ‘లంకేశ్వరుడు’ కి చిరంజీవి ఎందుకు తీసాడు ? ఆ సినిమా ఎందుకు ప్లాప్ అంటే?

Visitors Are Also Reading