Telugu News » Blog » ఎన్టీఆర్ పై ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. నెటిజ‌న్లు ట్రోల్స్‌..!

ఎన్టీఆర్ పై ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. నెటిజ‌న్లు ట్రోల్స్‌..!

by Anji
Ads

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కొమురం భీమ్ పాత్ర‌తో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచి అంద‌రిచేత శ‌భాష్ అనిపించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌కు ఆస్కార్ అవార్డు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా త‌రువాత తార‌క్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ చాలా మంది ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Ads


తాజాగా ఓ హీరోయిన్ ఎన్టీఆర్‌పై ట్వీట్ చేసింది. ఆమె చేసిన పొర‌పాటు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింద‌నే చెప్పాలి. బాలీవుడ్ బ్యూటీ అమిషా ప‌టేల్ మీకు గుర్తుకు ఉందా..? తెలుగులో ఈ చిన్న‌ది ప‌లు సినిమాల్లో న‌టించి మెప్పించింది. ముఖ్యంగా మ‌హేష్ స‌ర‌స‌న‌, నాని, ప‌వ‌న్ కు జోడిగా బద్రి సినిమాల్లో న‌టించింది. ఎన్టీఆర్‌తో క‌లిసి న‌ర‌సింహుడు అనే సినిమాలో న‌టించింది అమీషా ప‌టేల్‌. ఈమె చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Ads

Also Read :  భ‌ర్త బ‌ర్త్ డే రోజు షాకింగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా..!


ముఖ్యంగా నేను తార‌క్ తో క‌లిసి న‌టించిన న‌ర‌సింహుడు సినిమాలోని ఫోటో ఇది. ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ల‌వ్లీ కో స్టార్‌, నిజాయితీ గ‌ల వ్య‌క్తి అంటూ తార‌క్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. తార‌క్ పేరుకు బ‌దులు, వేరే ఫ్యాన్ మెడ్ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ట్యాగ్ చేసింది అమీషా. దీంతో నెటిజ‌న్లు చూసుకోవాలి క‌దా అంటూ ఆ పోస్ట్‌ను వైర‌ల్ చేస్తున్నారు. అది గ‌మనించిన అమీషా మ‌రో ట్యాగ్ ను జ‌త చేసింది.అది కూడా తార‌క్‌ది కాదు.. దీంతో మూడోసారి ట్వీట్ చేస్తూ తార‌క్ పేరు ట్యాగ్ లేకుండా షేర్ చేసింది.

Ad

Also Read :  ర‌జినీ జైల‌ర్ మూవీ నుంచి త‌ప్పుకున్న ప్రియాంక మోహ‌న్ ఎందుకో తెలుసా..?