Home » డ్రోన్ల వ్యాపారంలోకి ధోని.. ఇక మీద..?

డ్రోన్ల వ్యాపారంలోకి ధోని.. ఇక మీద..?

by Azhar
Ad
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి అందరికి తెలిసిందే. టీం ఇండియాకు మూడు ఐసీసీ టైటిల్ అందించిన ధోనికి ఇండియాలోనే ప్రపంచ క్యాప్తంగా చాలా ఫాలోయింగ్ ఉంది. అయితే ధోని ఆ ఫాలోయింగ్ ను ఎప్పుడు వృధా చేసుకోలేదు. తాను మంచి పిక్స్ లో ఉన్నప్పుడు యాడ్స్ లో నటిస్తూ కోట్లు సంపాదించాడు ధోని. అలాగే క్రికెటలో కూడా భారీగానే ఆర్జించాడు. అయితే 2019 లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తప్పుకున్న ధోని ఇప్పుడు కేవలం ఐపీఎల్ లోనే కొనసాగుతున్నాడు. కానీ ఈ ఐపీఎల్ 2022 సీజన్ లో మాత్రం కెప్టెన్ గా.. ప్లేయర్ గా ధోని సక్సెస్ కాలేకపోయాడు.
ఇదిలా ఉంటె.. తనకు ఉన్న ఖాళీ సమయాన్ని బిజినెస్ పైన దృష్టి పెట్టడానికి ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఇప్పటికే ధోని వ్యవయసంలో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నాడు. అన్ని రకాల కూరగాయలను పండిస్తున్నాడు. దానికి తోడు కోళ్ల ఫామ్ కూడా ఓపెన్ చేసిన ధోని కొన్ని కార్ల కంపెనీలలో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో రంగంలోకి ధోని అడుగు పెడుతున్నాడు. కొత్తగా డ్రోన్ల వ్యాపారంలోకి ధోని దిగాడు.
మన ఇండియాలో డ్రోన్లు తాయారు చేస్తున్న గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ లలో ధోని పెట్టుబడులు పెట్టాడు. దీనిపై తాజాగా మాట్లాడుతూ.. గరుడా ఏరోస్పేస్ లో పెట్టుబడులు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లు తాయారు చేసే ప్రత్యేకమైన డ్రోన్లతో వారి వృద్ధిని చూడటం కోసం నేను వేచిచూస్తున్నాను అని ధోని అన్నాడు. ఇక ఈ మధ్యే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,  కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాలు కూడా దేశంలో డ్రోన్ల పెరుగుదల కోసం ఈ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు..

Advertisement

Visitors Are Also Reading