గుడ్డు అనేది మనిషికి చాలా మంచిది. అందుకే చాలామంది ఈ గుడ్డును తింటూ ఉంటారు. అయితే ఎక్కువమంది ఈ గుడ్డులోని కేవలం వైట్ ను మాత్రమే తీసుకుంటారు. ఎల్లోను తినరు. మరి ఈ గుడ్డులోని ఎల్లో తింటే ఏమవుతుంది. ఈ గుడ్డు అనేది గుండె సమస్య ఉన్నవారు తినొచ్చా, తినకూడదా, తింటే ఏమైనా అవుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..!
read also : “పవన్ కళ్యాణ్” వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు వీళ్లే!
Advertisement
గుడ్డులోని వైట్ లో చాలా విటమిన్స్ మరియు ప్రోటీన్స్ ఉంటాయి. అవి పూర్తిగా మన శరీరానికి అందుతాయి. అందుకే ఎక్కువమంది కేవలం ఈ వైట్ ను మాత్రమే తిని ఎల్లోను వదిలేస్తారు. అయితే ఎల్లోలో కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎల్లోలో ఐరన్ అనేది ఉంటుంది. అది మన శరీరానికి చాలా మంచిది.
Advertisement
అలాగే మనకు నేచురల్ గా లభించే విటమిన్ D అనేది ఇందులో పుష్కలంగా దొరుకుతుంది. అదేవిధంగా ఇందులో విటమిన్ A కూడా ఉంటుంది. అది మన కంటికి చాలా మంచిది. ఇంకా విటమిన్ B కూడా ఈ ఎల్లోలో ఉంటుంది. అయితే ఇందులో కొంత కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. అది అంత హానికరం ఏం కాదు. అందుకే గుండె సమస్య ఉన్నవారు కూడా గుడ్డును తినవచ్చు. ఎవరైనా సరే కేవలం వైట్ ను మాత్రమే కాకుండా ఇందులో ఉండే ఎల్లోను కూడా తినడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు.
read also : బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?