వెలగపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది వెలగపండుని తేలికగా తీసి పారేస్తూ ఉంటారు. కానీ నిజానికి వెలగపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది చాలా రకాల సమస్యలను దూరం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం చూసినట్లయితే వెలగపండు వాంతులు, విరోచనాలు, జ్వరం, మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. అల్సర్ తో బాధపడే వాళ్ళు వెలగపండు తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది. ఈ పండు గుజ్జుతో చేసిన జ్యూస్ ని తీసుకుంటే రక్త శుద్ధికి మేలు చేస్తుంది.
Advertisement
Advertisement
50 మిల్లీగ్రాములు వరకు మీరు జ్యూస్ ని తీసుకోవచ్చు. ఎక్కిళ్ళు ఆగకుండా వస్తున్నట్లయితే కొంచెం ఈ జ్యూస్ ని తీసుకోండి వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. నీరసం కూడా తొలగిపోతుంది. అలసట నీరసముంటే వెలగపండు గుజ్జులో కొంచెం బెల్లం వేసుకొని తీసుకున్నట్లయితే శక్తి వస్తుంది. వెలగపండు తీసుకుంటే మూత్రపిండాల సమస్యల నుండి కూడా దూరంగా ఉండొచ్చు. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి కాబట్టి స్త్రీలు వెలగ పండుని తీసుకోవడం మంచిది మధుమేహాన్ని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు 21 రకాల బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి వెలగ పండులో ఉంది.
Also read:
- చాణక్య నీతి: కష్టాలే లేకుండా.. సంతోషంగా ఉండాలనుకుంటే.. ఇలా ఉండాలి…!
- వానాకాలంలో కచ్చితంగా ఖర్జూరం తినండి.. ఈ సమస్యలు దూరం అవుతాయి…!
- ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే… లక్ష్మీదేవి ఎక్కడకి వెళ్లిపోదు.. మీ దగ్గరే ఉంటుంది…!