Home » పారిజాతం పూలతో.. అజీర్ణం మొదలు కీళ్ల నొప్పులు వరకు ఈ సమస్యలన్నీ పోతాయి..!

పారిజాతం పూలతో.. అజీర్ణం మొదలు కీళ్ల నొప్పులు వరకు ఈ సమస్యలన్నీ పోతాయి..!

by Sravya

చాలామంది పారిజాతం పూలతో పూజలు చేస్తూ ఉంటారు. పారిజాతం పూలతో పూజ చేస్తే భగవంతుని ఆశీస్సులుని పొందవచ్చు. అయితే పారిజాతం పూలు వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పారిజాతం పూలే కాదు ఈ చెట్టు ఆకు, బెరడు, కొమ్మలు, ఇవన్నీ కూడా ఔషధంగా పనిచేస్తాయి. పారిజాతం పూలలో, ఆకులలో చక్కటి లక్షణాలు ఉంటాయి జ్వరాన్ని తగ్గించడానికి ఇది మందులా పనిచేస్తుంది. అలానే చెట్టు బెరడు తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. చెట్టు బెరడుని తీసి నీటిలో వేసి మరిగించుకోవాలి కషాయం చేసుకుని తీసుకుంటే జ్వరం ఇట్టే తగ్గిపోతుంది.

చాలామంది కీళ్ల వాపులతో బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ వలన ఇబ్బంది ఉన్నవాళ్లు ఈ సమస్య నుండి బయటపడడానికి పారిజాత పూల టీ ని తీసుకుంటే మంచిది లేదంటే ఈ ఆకుల ని టీ చేసుకు అయినా సరే తీసుకోవచ్చు. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఇందులో ఎక్కువ ఉంటాయి. వాపులు కూడా తగ్గుతాయి. మానవ శరీరంలో పిత్త దోషం వలన అజీర్తి సమస్య వస్తుంది ఈ దోషాన్ని తగ్గించడానికి పారిజాతం పూలు బాగా పనిచేస్తాయి.

గ్యాస్ట్రిక్ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యల్ని కూడా పారిజాతం తగ్గించగలదు. పారిజాతం పూలని లేదంటే ఆకులని టీ చేసుకుని తేనె కలుపుకొని పరగడుపున తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. చూశారు కదా పారిజాతం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. మరి రెగ్యులర్ గా దీనిని తీసుకోండి ఈ సమస్యల నుండి దూరంగా ఉండండి.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading