Home » ఆదిపురుష్ పవర్ ఫుల్ పోస్టర్ మీరు చూశారా ? మామూలుగా లేదుగా..

ఆదిపురుష్ పవర్ ఫుల్ పోస్టర్ మీరు చూశారా ? మామూలుగా లేదుగా..

by Anji
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’  సినిమా జూన్ నెలలో ప్రేక్షకులకు ముందు రాబోతున్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్  తెరకెక్కిస్తున్న  మూవీ కోసం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండడంతో ఆది పురుష్  సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. టీజర్ విషయంలో చాలా విమర్శలు వచ్చినప్పటికీ.. ట్రైలర్ తో వాటన్నింటికీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది చిత్ర యూనిట్.

Advertisement

వీఎఫ్ఎక్స్ మార్పులు అనంతరం రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియజేసింది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ ని షురూ చేసింది చిత్ర యూనిట్. ఓవైపు ఇటీవలే విడుదలైన సీతమ్మ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మరో పవర్ఫుల్ పోస్టర్ ని విడుదల చేసారు మూవీ మేకర్స్. తాజాగా విడుదలైన పోస్టర్లు హనుమంతుడి పై రాముడు నిల్చోని మిల్లు సంధిస్తున్నాడు. వస్తారు మరింత పవర్ ఫుల్ గా ఉంది ఇందులో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో మంచి విజువల్స్ ఎఫెక్ట్ అందించారు. ముఖ్యంగా బ్యాక్ డ్ స్కోరు గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి దృశ్యము కన్నుల పండుగ ఉంటుంది. ఈ సినిమాలో జూన్ 16న తెలుగుతోపాటు హిందీ తమిళం కన్నడం మలయాళం వంటి భాషల్లో విడుదల చేయనున్నారు. ఓవైపు సినిమా ప్రమోషన్స్ జరుగుతుండగా మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆదిపురుష్ సినిమా ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ది కేరళ స్టోరీ మూవీ పై అదాశర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..!

జీతం రూ.30వేలు.. ఆస్తులు రూ.7కోట్లు.. అవినీతిలో అధికారిని రికార్డు..!

Avatar 2 : అవతార్-2 ఫ్రీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్… ఎందులో స్ట్రీమింగ్ అంటే!

Visitors Are Also Reading