Home » Avatar 2 : అవతార్-2 ఫ్రీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్… ఎందులో స్ట్రీమింగ్ అంటే!

Avatar 2 : అవతార్-2 ఫ్రీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్… ఎందులో స్ట్రీమింగ్ అంటే!

by Bunty
Ad

అవతార్ 2 సినిమా సంచలన రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అవతార్-2 సృష్టించిన రికార్డుల ప్రభంజనం గురించి దాదాపు అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కనీవినీ ఎరుగని వసూళ్లను సాధించింది. యావత్ సినీ ప్రపంచాన్ని మంత్ర ముగ్దులను చేసింది. తెలుగులో కూడా దాదాపు రూ.60 కోట్లకు పైగా వసూలు చేసింది.

Advertisement

 

తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించిన డబ్బింగ్ చిత్రంగా దీనినే చెబుతున్నారు. అలాంటి సినిమా ఓటీటీలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త అనే చెప్పాలి. ఇప్పటివరకు అద్దె ప్రాతపాధికన పలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేసిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రం ఓటిటి ‘డిస్నీ+హాట్ స్టార్’ లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది.

Advertisement

రెంట్ చెల్లించకుండానే ఈ సినిమాని సదరు సంస్థ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచనుంది. ఈ విజువల్ వండర్ ని జూన్ 7న విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు వేచి చూడలేమని కొందరు కామెంట్లు పెడితే వావ్, సర్ప్రైజ్ అదిరింది అని మరి కొందరు అంటున్నారు. ఏ ఏ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని భాషల్లో విడుదలకానుందన్న విషయాన్ని మాత్రం డిస్నీ+హాట్ స్టార్ ఇంకా వెల్లడించలేదు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

Adah Sharma: రోడ్డు ప్రమాదంలో ఆదాశర్మకు తీవ్ర గాయాలు.. అసలు ఏమైంది

Vaishnav Tej : ‘ఆదికేశవ’గా వైష్ణవ్ తేజ్ ..ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!

Visitors Are Also Reading