Home » Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్ ని ఇలా ఎప్పుడైనా చూశారా..? ఫోటోలు వైర‌ల్..!

Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్ ని ఇలా ఎప్పుడైనా చూశారా..? ఫోటోలు వైర‌ల్..!

by Anji
Ad

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఒకే ఒక్క క‌న్ను గీటుతో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న ఈ మ‌ల‌యాల బ్యూటీ. ఆమె అదృష్టం అలా కుదిరిన ఆమె న‌టించిన ఓరు అదార్ ల‌వ్ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ త‌రువాత కూడా ఈ భామ న‌టించిన సినిమాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో అవ‌కాశాలు పూర్తిగా త‌గ్గాయ‌నే చెప్పాలి. ఇది ఇలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ తార తాజాగా కొన్ని ఫోటోల‌ను పంచుకున్నారు. ప్ర‌స్తుతం అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ప‌ర్స‌న‌ల్ విష‌యానికి వ‌స్తే.. ఆమె అక్టోబ‌ర్ 28, 1999న జ‌న్మించారు. తండ్రి సెంట్ర‌ల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి. ప్రియా వారియ‌ర్ కేర‌ళ‌లోని త్రిస్సూర్ లో సాందీప‌ని విద్యా నికేత‌న్ లో పాఠ‌శాల విద్య‌ను అభ్య‌సించారు. ఆ త‌రువాత ఆమె త్రిసూర్ లోని విమ‌లా కాలేజీలో బ్యాచిల‌ర్ ఆఫ్ కామ‌ర్స్ చేశారు. ప్ర‌స్తుతం ప్రియా ప్ర‌కాశ్ ఓ రెండు హిందీ చిత్రాల‌తో పాటు ఓ మ‌ల‌యాళీ చిత్రంలో న‌టిస్తున్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  అంద‌రికీ హిట్స్ ఇచ్చిన దాస‌రి కృష్ణ‌కు హిట్ ఇవ్వ‌లేక‌పోయారు…? కానీ ఆ లోటు ఎలా తీర్చారో తెలుసా..?


ప్రియా వారియ‌ర్ త‌న తొలి సినిమా ఒరు అదార్ ల‌వ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా ఆకట్టుకోలేక పోయింది. అయితే అవేమి ప‌ట్టించుకోకుండా ఇప్పుడు అందాల‌ను అలా కెమెరాకు వ‌దిలేసి హాయిగా గ్లామ‌ర్ షో చేస్తూ వార్త‌ల్లో ఉంటోంది ఈ భామ‌. 2018లో నీ వానం నాన్ మ‌ఝూయ్ విడుద‌ల‌కి ముందే క్రేజీ స్టార్ డ‌మ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి సిల్వ‌ర్ స్క్రీన్ మాత్రం క‌లిసి రావ‌డం లేదు. 2018లో రావాల్సిన శ్రీ‌దేవి బంగ్లా సినిమా పై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ ల‌వ్‌తో ప‌ల‌క‌రించినా అది మెప్పించ‌లేదు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ‘ఏ మాయ చేసావే’ సినిమా స్టోరీ విన్న మహేష్ మొదటి రియాక్షన్ ఏంటంటే ? సమంత కి అవకాశం అలా వచ్చిందా ?


చిన్న‌ప్ప‌టి నుంచే క్లాసిక‌ల్ డ్యాన్స్ నేర్చుకుంది ఈ కుట్టి. వెండితెర‌పై ఓ వెలుగు వెల‌గాల‌నే ఆశ‌తోనే సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ప్రియా వారియ‌ర్ సోష‌ల్ మీడియాలో 7.1 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ తో చ‌క్క‌ని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మోడ‌లింగ్ చేస్తూ.. బ్యూటీ పేజేంట్స్ లో ర్యాంపు వాక్ తో క‌ట్టిప‌డేస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రియా, నితిన్ స‌ర‌స‌న చెక్ సినిమాతో ప‌ల‌క‌రించింది. అయితే ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో ఈ భామ‌కి తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  ఆడదానికి ఉన్న తెగింపు నీకు లేదంటూ విజయ్ ని దారుణంగా అవమానిస్తున్న నెటిజన్స్..!!


టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌హించిన ఈ సినిమా బాక్సాపీస్ ద‌గ్గ‌ర తేలిపోయింది. దీంతో తెలుగులో పాగా వేయాల‌నుకున్న ప్రియా వారియ‌ర్ ఆశ‌ల‌కు ఈ సినిమా బ్రేకులు వేసింది. అప్ప‌ట్లో త‌న పై వ‌చ్చే ట్రోల్స్ భ‌రించ‌లేక ఇన్‌స్టాగ్రామ్ నుంచి ప‌క్క‌కి త‌ప్పుకుంది. ఆ త‌రువాత మళ్లీ సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ వ‌చ్చింది. అయితే నేం అవేమి ప‌ట్టించుకోకుండా ఇప్పుడు అందాల‌ను అలా కెమెరాను వ‌దిలేసి హాయిగా గ్లామ‌ర్ షో చేస్తుంది. ప్రియా పాలు గారే అందాల‌ను చూసి బాపురే ఏం భామ‌రో అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు.

 

ఇది కూడా చ‌ద‌వండి :  ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే అన్నగారికి గుండెనొప్పి అప్పుడు ఆయన ఏం చేసారంటే ?

Visitors Are Also Reading