Home » ఆడదానికి ఉన్న తెగింపు నీకు లేదంటూ విజయ్ ని దారుణంగా అవమానిస్తున్న నెటిజన్స్..!!

ఆడదానికి ఉన్న తెగింపు నీకు లేదంటూ విజయ్ ని దారుణంగా అవమానిస్తున్న నెటిజన్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సోషల్ మీడియా వచ్చాక ఎంతటి వారినైనా నెటిజన్స్ ట్రోల్ చేసేస్తున్నారు.. ఇది సినీ నటుల విషయంలో ఎక్కువగా ఉంటుంది.. కొంతమంది వారి స్థాయికి మించి పెద్ద పెద్ద స్టార్స్ ను నెట్టింట్లో దిగజారుస్తారు. దీంతో ఆ హీరో అభిమానులకు కోపం వస్తుంది. అయినా ఈ నెటిజన్స్ వారి చెప్పాలనుకున్నది తప్పనిసరిగా చెప్పేస్తారు. ఈ తరుణంలోనే హీరో విజయ్ దేవరకొండ గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీ లో క్లాస్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో ఒక ఊపు ఊపేశాడు.. సినీ ఇండస్ట్రీనె తన వైపు చూసేలా చేసుకున్నాడు..

Advertisement

ALSO READ:మెగాస్టార్ నుండి అల్లు అర్జున్ వరకు వారికిష్టమైన ఆహారపదార్థాలు.. ఏంటంటే..?

Advertisement

ఎంతోమంది అభిమానులు హీరో అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా తర్వాత విజయ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద పల్టీ కొట్టాయి.. ఇక తాజాగా పాన్ ఇండియా లెవల్లో లైగర్ సినిమాతో భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. దీంతో ఫ్యాన్స్ అంతా నిరాశలో పడ్డారు. కానీ ఇందులో అసలు విషయం ఏమిటంటే సినిమా ఫ్లాప్ వచ్చింది విజయ్ దేవరకొండ నటన తో కాదు.. పూరి జగన్నాథ్ డైరెక్షన్ కారణంగా అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.. ఇక ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ ఈ సినిమాకు 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట.. ఈ తరుణంలో దీనిపై ఒక న్యూస్ హల్చల్ అవుతోంది..

అయితే సినిమా ఫ్లాప్ అయినా అందుకు విజయ్ దేవరకొండ వెనక్కి ఇవ్వలేదని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొంతమంది నెటిజెన్స్ హీరోయిన్ సాయి పల్లవితో విజయ్ దేవరకొండ పోల్చి మరీ దారుణంగా పరువు తీస్తున్నారు. సాయి పల్లవి చేసిన ఏ సినిమా ఫ్లాప్ అయినా ఆమె పారితోషికం తిరిగి ఇచ్చేస్తుందట.. విజయ్ దేవరకొండ అంత ఫ్లాప్ అయిన సినిమాకు తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చే అంత తెగింపు కూడా, ఒక ఆడదాని కున్న ధైర్యం లేదని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ:

Visitors Are Also Reading