Home » అంద‌రికీ హిట్స్ ఇచ్చిన దాస‌రి కృష్ణ‌కు హిట్ ఇవ్వ‌లేక‌పోయారు…? కానీ ఆ లోటు ఎలా తీర్చారో తెలుసా..?

అంద‌రికీ హిట్స్ ఇచ్చిన దాస‌రి కృష్ణ‌కు హిట్ ఇవ్వ‌లేక‌పోయారు…? కానీ ఆ లోటు ఎలా తీర్చారో తెలుసా..?

by AJAY
Ad

ఒక‌ప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోల‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా ఒక‌రు. ఎన్టీఆర్ స్టార్ హీరోగా రానిస్తున్న స‌మ‌యంలో కృష్ణ ఎన్టీఆర్ కు పోటీ ఇచ్చారు. అంతే కాకుండా అల్లూరి సీతారామరాజు సినిమాను మొద‌ట ఎన్టీఆర్ చేయాల‌ని అనుకున్నార‌ట‌.ఈ విష‌యం కృష్ణ‌కు చెప్పిన‌ప్ప‌టికీ ఆయ‌న అల్లూరి సీతారామ‌రాజు సినిమా షూటింగ్ ను ఆప‌కుండా పూర్తి చేసి విడుద‌ల చేశారు. ఈ సినిమా ఎంత‌టి గ‌ణ విజ‌యం సాధించిందో తెలిసిందే.

Advertisement

మ‌రోవైపు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌గా కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్టీఆర్ కు వ్య‌తిరేఖంగా ప్రచారం చేశారు. అయితే ఇదంతా కేవ‌లం అప్ప‌టి వ‌ర‌కే…ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ త‌మ మ‌ధ్య ఎలాంటి శ‌తృత్వం లేద‌ని ఆరోగ్య‌క‌ర‌మైన పోటీనే అని చెప్పుకున్నారు. ఇదిలా ఉండ‌గా కృష్ణ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించారు. ఆయ‌న ఖాతాలో ఇండ‌స్ట్రీ హిట్ లు ఉన్నాయ‌. కౌబాయ్ చిత్రాల‌లో న‌టించి ట్రెండ్ సెట్ చేశారు.

Advertisement

అంతే కాకుండా చాలా మంది ద‌ర్వ‌కుల‌తో కృష్ణ సినిమాలు చేశారు. కృష్ణ కెరీర్ లో ఎన్నో సూప‌ర్ హిట్స్ ఉన్నాయి. కానీ అప్ప‌టి లెజండీ డైరెక్ట‌ర్ త‌న‌కు హిట్ ఇవ్వ‌లేద‌ని కృష్ణ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. కృష్ణ దాస‌రి కాంబినేష‌న్ లో శుభ‌మ‌స్తు అనే సినిమా విడుద‌లైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. కానీ దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒసేయ్ రాముల‌మ్మ సినిమాలో కృష్ణ గెస్ట్ రోల్ చేయ‌గా ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

అలా దాస‌రి కృష్ణ హీరోగా న‌టించి సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా అతిధి పాత్ర‌లో న‌టించిన ఒసేయ్ రాముల‌మ్మ సినిమాతో హిట్ ఇచ్చార‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా కృష్ణ వృద్దాప్యంతో ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. విజ‌య నిర్మ‌ల బ్ర‌తికి ఉన్న స‌మ‌యంలో అప్పుడప్పుడూ సినిమా ఫంక్ష‌న్స్ లో కనిపించేవారు. కానీ ప్ర‌స్తుతం ఆయ‌న పూర్తిగా ఇంటికే ప‌రిమితం అయ్యారు.

Visitors Are Also Reading