Home » ‘ఏ మాయ చేసావే’ సినిమా స్టోరీ విన్న మహేష్ మొదటి రియాక్షన్ ఏంటంటే ? సమంత కి అవకాశం అలా వచ్చిందా ?

‘ఏ మాయ చేసావే’ సినిమా స్టోరీ విన్న మహేష్ మొదటి రియాక్షన్ ఏంటంటే ? సమంత కి అవకాశం అలా వచ్చిందా ?

by AJAY

నాగ‌చైత‌న్య కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఏమ్మాయ చేసావే సినిమా ఒక‌టి. ఈ సినిమా త‌ర‌వాత‌నే చైత‌న్య‌కు టాలీవుడ్ లో హీరోగా గుర్తింపు వ‌చ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా స‌మంత న‌టించింది. స‌మంత సినిమాలో జెస్సీ అనే పాత్ర‌లో న‌టించ‌గా చైతూ కార్తీక్ అనే పాత్ర‌లో న‌టించారు. ఇక కార్తీక్ ఇంటిపైన జెస్సీ అద్దెకు ఉండ‌టం వ‌య‌సులో జెస్సీ సంవ‌త్స‌రం పెద్ద‌ది కావ‌డంతో పాటూ ఇద్ద‌రి మ‌తాలు వేరు కావ‌డం ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు ఏమ్మాయ చేసావే సినిమాలో ఉన్నాయి.

ప్ర‌పంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉండ‌గా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను అనే డైలాగ్ ఈ సినిమాలో ఉండ‌గా ఆ డైలాగ్ చాలా ఫేమ‌స్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా త‌మిళ వ‌ర్ష‌న్ లో శింబు, త్రిష హీరో హీరోయిన్లుగా న‌టించారు. అక్క‌డ కూడా ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక తెలుగులో ఏమ్మాయ చేసావే సినిమా చేయాల‌ని అనుకున్న‌ప్పుడు గౌత‌మ్ మీన‌న్ చైతూ కంటే ముందు మ‌హేశ్ బాబ‌ను ఈ సినిమా కోసం సంప్ర‌దించార‌ని చాలా మందికి తెలియ‌దు.

నిజానికి మ‌హేశ్ బాబు సోద‌రి మంజుల‌కు ఈ సినిమా చాలా న‌చ్చ‌డంతో తెలుగులో చేయాల‌ని మ‌హేశ్ ను కోరింద‌ట‌. అయితే గౌత‌మ్ మీన‌న్ చెప్పిన క‌థ పూర్తిగా విన్న మ‌హేశ్ త‌న‌కు క‌థ బాగా న‌చ్చింద‌ని చెప్పాడట‌. కానీ తన ఇమేజ్ కు ఇలా పూర్తిగా ల‌వ్ స్టోరీ చేస్తే సెట్ కాదేన‌ని మ‌హేశ్ బాబు రిజెక్ట్ చేశారు. ఆ త‌ర‌వాత చైతూకు ఆఫ‌ర్ వెళ్లింది.

ఇక స‌మంత ఏమ్మాయ చేసావే సినిమా ఆడిష‌న్స్ కోసం ఫోటోల‌ను పంపింది. ఆ ఫోటోల‌ను చూసిన త‌ర‌వాత గౌత‌మ్ మీన‌న్ ఆడిష‌న్స్ కు పిలిచాడు. ఆమె న‌ట‌న న‌చ్చ‌డంతో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అలా వ‌చ్చిన ఏమ్మాయ చేసావే సినిమా ప్రేక్ష‌కుల‌ను మాయ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాగా నిలిచింది.

Visitors Are Also Reading