Home » జమ్మూలో గాలించండి.. ఇంకా దొరుకుతారు కావచ్చు..?

జమ్మూలో గాలించండి.. ఇంకా దొరుకుతారు కావచ్చు..?

by Azhar

ఐపీఎల్ 2022 లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఈ ఐపీఎల్ 2022 లో తనని సన్ రైజర్స్ యాజమాన్యం 4 కోటకు రిటైన్ చేసుకోగా.. మొదటి రెండు మ్యాచ్ లలో చాలా నిరాశపరిచాడు. దాంతో అతనిపై విమర్శలు రాగ… తర్వాత మూడో మ్యాచ్ నుండి అతను పుంజుకున్నాడు.

పంజాబ్ పైన అతను వేసిన నాలుగో ఓవర్ తోనే అందరి ప్రశంసలు పొందిన… నిన్న గుజరాత్ పై చెలరేగిపోయాడు. దాంతో అతని పై కామెంటేటర్ హర్షా భోగ్లే విచిత్రంగా కామెంట్ చేసాడు. ఉమ్రాన్ మాలిక వచ్చిన జమ్మూకు ఒక మంచి టీం ను పంపించి వెతికించండి.. ఇంకా అతనిలాంటి వారు దొరకవచ్చు అని అన్నారు. ఇక దానికి ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పదిస్తూ.. అవును దొరికే అవకాశం ఉంది అని చెప్పాడు.

అయితే గుజరాత్ పైన మ్యాచ్ లో ఉమ్రాన్ ఒక్కడే 5 వికెట్లు పడగొట్టాడు. ఇది అతని ఐపీఎల్ కెరియర్ లో మొదటి 5 వికెట్ల ప్రదర్శన. ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ కు తోడుగా మారె బౌలర్ అయిన వికెట్లు తీసి ఉంటె హైదరాబాద్ డబల్ హ్యాట్రిక్ విజయాలు అందుకునేది. ఇక సన్ రైజర్స్ తర్వాతి మ్యాచ్ వచ్చే నెల 1న చెన్నై సూపర్ కింగ్స్ తో ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో మాలిక్ ఏం చేస్తాడు అనేది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి రెస్ట్ ఇవ్వం : బీసీసీఐ

ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ గా స్టోక్స్…!

Visitors Are Also Reading