Home » ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ గా స్టోక్స్…!

ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ గా స్టోక్స్…!

by Azhar
Ad

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన టెస్ట్ జట్టుకి కెప్టెన్ గా ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను నియమించుకుంది. ఈ విషయాన్ని కాసేప్పటి క్రితం స్వయంగా ప్రకటించింది. అయితే ఇంతకాలం ఆ జట్టును పరిమిత ఓవర్లలో ఇయాన్ మోర్గాన్ నడిపించగా.. టెస్టులో జో రూట్ కెప్టెన్ గా వ్యవహరించేవాడు. కానీ అతను తప్పుకోవడంతో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

అయితే గత ఏడాది జరిగిన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. అనంతరం విండీస్ పర్యటనలో కూడా ఇంగ్లాండ్ చెత్త ప్రదర్శన చేయడంతో దానికి కెప్టెన్ గా బాధ్యత వహిస్తూ.. రూట్ నాయకునిగా తప్పుకున్నాడు. దాంతో తర్వాతి కెప్టెన్ గా ఈసీబీ మేనేజింగ్ డైరక్టర్ బెన్ స్టోక్స్ పేరును బోర్డుకు రికమండ్ చేయగా.. తాజాగా ఈసీబీ బోర్డు అందుకు ఆమోదం తెలిపింది.

Advertisement

హాంతో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు 81వ కెప్టెన్ గా స్టోక్స్ నిలవనున్నాడు. ఇక క్రికెట్ పుట్టిన దేశం అయిన ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకి కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై బెన్ స్టోక్స్ స్పదించాడు. ఈ బాధ్యతలను గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. అలాగే ఈ అవక్షంమ్ నాకు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది అని చెప్పిన స్టోక్స్… సారథిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

సచిన్ కు సెంచరీ చేస్తే 50 కోట్లు వచ్చేవి.. ఎలాగో తెలుసా..?

ఆ మ్యాచ్ చూస్తూ హోటల్లో చాలా పగలగొట్టా…!

Visitors Are Also Reading