Home » కోహ్లీకి రెస్ట్ ఇవ్వం : బీసీసీఐ

కోహ్లీకి రెస్ట్ ఇవ్వం : బీసీసీఐ

by Azhar
Ad

ప్రస్తుతం ఐపీఎల్ 2022 లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడుతున్న తీరు అభిమానులను చాలా కలవరపెడుతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో 8 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోయాడు. అలాగే వరుసగా గోల్డెన్ డక్ అవుట్ లు కూడా అయ్యాడు. దాంతో అతని పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది భారత మాజీ ఆటగాళ్లు కోహ్లీ విశ్రాంతి తీసుకోవాల్సింది గా చెబుతున్నారు.

Advertisement

కోహ్లీ పరుగులు చేయడనికి కష్ట పడుతున్నాడు కాబట్టి.. అతనికి ఐపీఎల్ తర్వాత జరిగే సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ నుండి విశ్రాంతి ఇవ్వలని అడుగుతున్నారు. కానీ బీసీసీఐ మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా లేదు అని తెలుస్తుంది.

Advertisement

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అందువల్ల కోహ్లీకి రెస్ట్ ఇస్తే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సౌత్ ఆఫ్రికా పర్యటనలో జట్టు తరపున ఆడి తన ఫామ్ ను నిరూపించుకోవాలని బీసీసీఐ కోహ్లీకి తెలిపినట్లు అర్ధం అవుతుంది. విరాట్ కోహ్లీ స్వయంగా తప్పుకోవాలనుకుంటే తప్ప అతడిని తప్పించే ఉదేశ్యం బీసీసీఐ లేదు. అయితే కోహ్లీ కూడా సఫారీలతో టీ20 సిరీస్ ఆడటానికి అంగీకరించాడని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఆ మ్యాచ్ చూస్తూ హోటల్లో చాలా పగలగొట్టా…!

సచిన్ కు సెంచరీ చేస్తే 50 కోట్లు వచ్చేవి.. ఎలాగో తెలుసా..?

Visitors Are Also Reading