Home » బీసీసీఐకి డెడ్ లైన్ ప్రకటించిన ఐసీసీ…!

బీసీసీఐకి డెడ్ లైన్ ప్రకటించిన ఐసీసీ…!

by Azhar

గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది మళ్ళీ అక్టోబర్ లో అదే ఆస్ట్రేలియా వేదిక ఈ పొట్టి ప్రపంచ కప్ 2022 జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీకి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా రూపంలో 8 జట్లు అర్హత సాధించగా మరో నాలుగు జట్ల ఇందులో చేరనున్నాయి. అందుకోసం క్వాలిఫైర్ మ్యాచ్ లు జరుగుతాయి.

ఇక గ్రూప్ బి లో ఉన్న ఇండియా తన మొదటి మ్యాచ్ అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అయితే గత ప్రపంచ కప్ లో కూడా పాక్ తోనే మొదటి మ్యాచ్ ఆడిన ఇండియా ఘోరంగా ఓడిపోవడంతో ఈ ఏడాది ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటె ఈ ప్రపంచ కప్ లో ఆడనున్న ఇండియాతో సహా మిగితా అన్ని జట్ల క్రికెట్ బోర్డులకు ఐసీసీ కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఐసీసీ తాజాగా బీసీసీఐతో పాటుగా అన్ని బోర్డులకు సెప్టెంబర్ 15 వరకు సమయం ఇచ్చింది. ఆలోగా ప్రపంచ కప్ కోసం తమ తమ జట్లను ప్రకటించాలని తెలిపింది. అయితే తాజాగా సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో పాల్గొన టీం ఇండియా.. ఈ ప్రపంచ కప్ ప్రారంభమయ్యేలోపు ఐర్లాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లతో మొత్తం 15 టీ20 మ్యాచ్ లు ఆడనునది. అలాగే మధ్యలో ఆసియా కప్ లో కూడా పాల్గొననుంది. ఇక ఈ అన్ని ప్రదర్శనలను చూసే ఈ వరల్డ్ కప్ కు మన జట్టును ఎంపిక చేయనుంది బీసీసీఐ.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ పేరిట ట్రిపుల్ సెంచరీ రికార్డ్…!

జావెలిన్ త్రో చేస్తూ కింద‌ప‌డ్డ నీర‌జ్ చోప్రా..అస‌లు ఏం జ‌రిగిందంటే..?

Visitors Are Also Reading