Home » పెళ్లి అయ్యి నెల కాకముందే.. పెళ్లిపై దీపక్ షాకింగ్ కామెంట్స్..!

పెళ్లి అయ్యి నెల కాకముందే.. పెళ్లిపై దీపక్ షాకింగ్ కామెంట్స్..!

by Azhar
Ad

గత ఏడాది కాలంగా భారత క్రికెట్ ఆటగాళ్లు చాలా మంది పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా కాలంలో అయితే చాలా మంది ఆటగాళ్లు ఓ ఇంటివాళ్ళు అయ్యారు. ఇప్పుడు కరోనా ముగిసిన తర్వాత కూడా ఈ పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ నెల 3న భారత పేసర్ దీపక్ చాహర్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఐపీఎల్ 2021 సమయంలో తన ప్రేయసి జయ భరధ్వాజ్ కు ప్రపోస్ చేసిన దీపక్ ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

ఈ నెల 3న ఢిల్లీలో కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్న దీపక్.. ఆ తర్వాత భారత ఆటగాళ్ల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసాడు. ఇందులో భారత యువ ఆటగాళ్లు చాలా మంది పాల్గొన్నారు. అయ్హతే మాములుగా పెళ్లి తర్వాత మగాడి ఆలోచన అనేది మారిపోతుంది అని చాలా మంది అంటారు. అప్పటివరకు పెళ్లి మీద ఉన్న తన ఒపీనియన్ కాస్త రివర్స్ అవుతుంది. అయితే ఇది జరగడానికి అందరికి ఒక్క ఏడాది సమయం పడుతుంది. కానీ దీపక్ విషయంలో చాలా తొందరగా జరిగిపోయింది.

Advertisement

సరిగ్గా ఈ రోజుకి పెళ్లి జరిగి 17 రోజులే పూర్తయింది. కానీ పెళ్లి పైన దీపక్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. తన ఇంస్టాగ్రామ్ లో.. తన పెళ్లిలో భార్య జయతో డ్యాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేసిన దీపక్.. ” మ్యాచ్ లో కంటే ఇక్కడే ఎక్కువ ఒత్తిడి ఉంది” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ దీపక్ పోస్ట్ పైన ఫన్నీగా స్పందిస్తున్నారు. పెళ్లి అయ్యి నెల కాకముందే ఇలా అంటే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇంకొంత మంది అందుకే పెళ్లి చేసుకోవద్దు అని మేము చెప్పిన వినలేదు అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ పేరిట ట్రిపుల్ సెంచరీ రికార్డ్…!

జావెలిన్ త్రో చేస్తూ కింద‌ప‌డ్డ నీర‌జ్ చోప్రా..అస‌లు ఏం జ‌రిగిందంటే..?

Visitors Are Also Reading